పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మే 2014, సోమవారం

Jaya Reddy Boda కవిత

// జయ రెడ్డి బోడ // రేపటి ఆశ // నాకు నిన్న రాత్రి మగత నిద్ర లో ఒక మధుర స్వప్నం ఎవరో దైవ దూత ఒక చక్కని సువార్త లోకానికి మోసుకొచ్చినట్లు దేవేంద్రుడు తన కన్నా కలియుగానికే ఎక్కువ అవసరమని "కల్ప వృక్షం" బహుమతిగా పంపినట్లు అక్రమర్కులంతా తమ అక్రమాస్తులన్ని కనువిప్పుతో ప్రజలకు పంచినట్టు కొత్త నాయకత్వం అంతా ఏ సామాన్యుడి చెమట చుక్క దోచుకోమని శభదమ్ చేసినట్టు అది చూసి లోకులంతా ఆనంద పారవశ్యంలో నృత్యం చేస్తున్నట్టు నేను వారి సంతోషానికి రెండు ఆనంద బాష్పలనై రాలుతున్నట్టు నన్ను నేలను తాకకుండా నా ప్రేయసి కళ్ళతో తాగేసి తన హృదయ పానుపు పై సేద దేర్చినట్లు... నేనేమో దిగ్గున లేచి అన్ని కలల్లాగే ఇదికూడా ఎక్కడ కరిగి పోతుందో నని,, ఇలా మీ ముందుకు వంపి మళ్లీ కరిగి పోనీ చీకటి లోకి జారుకుంటూ ఈ కల "రేపటి ఆశ" ఆయి మొలకెత్తునేమో అన్న ఆశతో ... (19-05-2014)

by Jaya Reddy Boda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jdCni3

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి