పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, మే 2014, మంగళవారం

Ramaswamy Nagaraju కవిత

అనువాద కవిత్వం : ......॥ జీవితం!॥..... . ( Life ) . ఓ మార్మిక వైచిత్రీ! ఆనంద పుత్రీ! మానస వైవశ్యమా !జీవితమా! నీ ఉద్గమన పయన పరిధికి అవనివ్వు అనంతమే అవధి . నీ పక్షాలు మోస్తున్నవి ఔన్నత్య కీర్తిని, ఉపేక్షను, దైవత్వాన్ని అపార పారవశ్యాన్ని, ఆవేదనను, మరణాన్ని. జీవితమా! తీసుకో నన్ను నీ ఆలింగనం లోకి అనాఛ్చాదితంగా, నిస్సంకోచంగా, రాజీ రహితంగా, విస్మృతీ రాహిత్యంగా. అన్వేషిస్తాను నేను ఉదధి ఉప్పెన వంటి నీ మహదానందాన్ని సింహ గర్జన లాంటి నీ క్రూరత్వాన్ని కబళిస్తాను అసురునిలా కలహిస్తాను మానవునిలా ఆనందిస్తాను అనంతునిలా చిందులేస్తాను చిన్నారిలా . నిన్నేమీ అర్థించను ఏదీ ఆశించను విధినుండి ఓడినా గెలిచినా బ్రతికినా మృతిచెందినా . చింపి గుడ్డల్లోనూ నేను దేవుణ్ని నేల కొరిగినా దైవాన్ని అణచబడినా అజేయున్ని హతమైనా నేను అమరున్ని . మూలం : మహర్షి అరవింద ఘోష్ , (sri Aurobindo collected poems ) స్వేఛ్ఛానువాదం : నాగరాజు రామస్వామి.

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jX8rHd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి