//kuppili sudarshan// * లోక్ సభ స్వగతం * నీకెలా పుట్టిందీ ఈ మెట్టుకి మొక్కాలనీ నిద్రిస్తున్న నా దైవత్వాన్ని మేల్కొలపాలనీ.. నేనొక మురికికూపమైపోయాక నీలో దేశభక్తి తుఫానై వొచ్చి నాకు తలంటినట్లుంది.. కాసేపహల్యాతుల్యనైనాననుకో.. నన్ను కాస్త కుదురుకోనీ ఇంకొంచెం తేరుకోనీ.. నీగురించి నాలో ఉన్న ప్రతి మట్టిపెళుసుకీ ఉద్వేగంగా చెప్పనీ.. మునుపు మసిబారిన నా ప్రజాస్వామ్యపు పడిగాపులూ తలబిరిసిన కులౌకికవాద చరిత్రలూ నన్ను ప్రశ్నించీ విసిగీ సమాధానాలు రాక లేకా, ఏ గది ఐమూలల్లోనో నా దేశ భావజాలాన్ని పాతిపెట్టీ దేశదేశాలకీ నేనొక మేడిపండు సౌధమని వర్తమానాలు పంపిస్తుంటే_ తల యెత్తి యెలా చూడగలనూ? ఏ 'పా'పాలకులను ఎంతని భరించగలనూ? మరో కుచిత్రమిది_ నిరాశతో ప్రజలంతా వాళ్ళ గుండెల్లొ వేదనలకీ- రోదనలకీ రాజ్యాంగంలో చుక్కలూ-కామాలే చిరునామాలుగా పెట్టి, నోటుకి వోటను బాటను పట్టీ_ అపుడు నేనేమయ్యానూ? నన్నేమన్నారూ? 'పిశాచ శయ్యాగారం' ! ఇంతకీ నీకెలా పుట్టిందీ ఈ మెట్టుకి మొక్కాలనీ నిద్రిస్తున్న నా దైవత్వాన్ని మేల్కొలపాలనీ..? సరే ఇపుడు నీకు శెభాషనమంటావా దేశభక్తా భారతీ గళ వక్తా.. విను విను నాలో ఉద్రేకంగా మేల్కొన్న స్వతంత్ర పూర్వపు స్వేచ్చా గాలులు ఐదేళ్ళొక లిప్త కానివ్వొద్దంటున్నాయ్. . ! 26th may ఆంధ్ర జ్యోతి వివిధలో ప్రచురితం. . 27/5/2014
by Sudarshan ON Screen
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jXhp8K
Posted by Katta
by Sudarshan ON Screen
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jXhp8K
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి