పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, మే 2014, మంగళవారం

Pratapreddy Kasula కవిత

ఉచితంగా మరణం - కాసుల ప్రతాపరెడ్డి గిన్నెల చేతులు కడిగి కండువా భుజానేసుకుంటవు వస్తనో, రానో, వుంటనో, పోతనో పైలమని చెప్పవు బాయి మీద మోటరు తొందర పెడతది కుండలెంత గోకినా పిడికెడు చేతికందది ఆ తల్లి బొటబొటా రాల్చే కన్నీళ్లు గుండె మీద టపాటపా రాలి ముద్ద కడతయి అద్దెకరం పొలం అప్పట్ల ఇంటిల్లిపాదికీ ఆదరువు జీవితానికి దీమూ, ఆత్మగౌరవమూ బాయి మీద మోటారు తొందరపెడతది మధ్యలోనే చావు బుసకొడుతూ కాటేయొచ్చు విద్యుత్తరంగాల పగ్గాలతో యముడు మాటేయవచ్చు రూపమేదైనా కావొచ్చు, పగ పట్టింది నిన్నే కదా! నీలం నీలంగా మెరుపు మెరుపులుగా ఆకుపచ్చ బటనే ఒంటి రక్తాన్ని పీల్చేసి విసిరేయొచ్చు ఎంత నాశనగాలమిది! కరెంటుకూ, ధరలకూ, బుక్కెడు బువ్వకే కాదు ప్రాణాలకూ బిచ్చగాణ్ని చేసిండ్రు కదా! బయటి శత్రువు లోపలి శత్రువు ఒక్కడే అద్మ రాత్రి కరెంటిచ్చేవాడు రాత్రి పూట తిరుగొద్దన్నవాడు ఒక్కరా, ఇద్దరా? నాలుక చీలినప్పుడు నాగుపామే! అంతా యెటమటం మోట గొట్టిన యాల్లనే బాగుండేదేమో! నడిరాత్రి నడమంత్రం చావు లేదు ఉచిత కరెంటును ఎగబెట్టే ఇకమతులేమో! నాణ్యతకు దొడ్డిదారి ఆమోదం కావాలేమో!! అందుకనే ఉచితార్థంగా నీ చావును రాసిపెట్టారేమో!!! కాయకష్టమెరిగినవాడివి కదా! ఈ కొత్త చావుల ముచ్చట్లు నీకేమెరుక?! (వైయస్ పాలనలో రాసిన కవిత ఇది)

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvDLhp

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి