పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, మే 2014, మంగళవారం

Sriramoju Haragopal కవిత

చివరకు మిగిలేది.... ఎక్కడుందో జడిసి జడిసి వొణికిపోయి అణు,పరమాణు, కణజాలాలన్ని ముడుసుకుపోయిన గొంతులోని మాట ఎన్ని కాలాలనుండి వెతుక్కుంటున్నాను నా మాటని నేను పరకాయప్రవేశం చేసిన వాగర్థాలేవేవో నన్ను నన్నుగా పలుకనియ్యవు సుతారంగా చుట్టుకున్న తీగెలదారుల్లో సిగ్గులొలుకుతూ కట్లపూలై పూసిన నవ్వులన్ని అలవోకగా ఆకాశం వాలుమీద జారిన వెన్నెలలన్ని నీ కోసం నిరీక్షించిన వూపిరిగాలులలోకి దిగిన కలలపరిమళాలన్ని పిలుపులకోసం దారులు కాచిన పెదవుల వంతెన తెరిచి విడిచిన నౌకల్లా ఏవి మాటలు చిట్టీచిట్లని దుఃఖాల గాజులని వొడుపుగా సింగిడీలు చేసుకుని అల్లీఅల్లని వూహల పింగాణీపాత్రల వొరల్లో రంగులద్దుకుని ఆ వంకో ఈ వంకో విసిరినవో కసిరినవో పలుచని స్నేహాలని పుట్టినాకో పుట్టక మునుపో నిన్ను కలువాలని చేసిన ప్రతిజ్ఞల్ని మేఘాల మీద గీసిన నీటిరంగుల నీ చిత్రాల లాస్యాలు, లవణిమల్ని స్వరపేటిక తంత్రులు కదలీ కదలక, కదలనివ్వని వొత్తిళ్ళ మత్తల్లు దూకాల్సిన మాటలేయి నీవెక్కడున్నావురా నా చుట్టూరా నీ జ్ఞాపకాల కాంతి పరివేషాలు గుండెతొనల్ని వొలిచిపోసి మాధుర్యాల్ని గ్రోలే నీ కౌశలం తెలుసు నాకు నేను వ్యక్తం కాని నిర్వేదనని, నిశ్శబ్దాన్ని మిణుగురు వెలుగుల్లా ఆశలపుప్పొడులు రాల్చే చిరువెన్నెలల నెలపొడుపా నా మాటలు నాకివ్వు నీతోనే మాట్లాడనీ చివరిసారి

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mtJDGK

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి