కత్తిమండ ప్రతాప్ ||రాలిపోయే కాలం|| ======================== సముద్రం ఒడ్డున దొరికే గవ్వల్లో కుచించే మనసులాగ లోతుల్లో దొరికే గులకరాళ్ళు ఆకారాలై మనిషి కళాఖండాలును మైమరపిస్తూ ఏడుపిస్తున్నాయి తడిచే నేల నెలవంకను తనలో దాచుకుంది ముద్దాడే చందమామ సిగ్గులొలికింది గోరు ముద్దలు తినిపించే చిన్నారిని మైమరపించి! రాలిపోయే కాలం వెక్కిరిస్తుంది కాలం చెల్లిన పువ్వులాగా! వర్తమానంలో మళ్లీ స్వగతాలై గతాలును చితి చేస్తున్నాయి మాటలన్నీ చేతలైతే నడిచే దారి బీటలు తీస్తుంది దారిలో ఎన్నో టచ్మీనాట్ మొక్కలు సిగ్గుగా కళ్ళు మూసుకుంటూ తల వంచుకుంటున్నాయి కాలాలు మారి గాయాలవుతున్నాయి నడిచే కాలం భవిష్యత్తునే శాసిస్తుంది ప్రశ్నించే సమాజం ఎప్పుడూ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది ఆవేశం కట్టలు తెంచుకుంటుంది భానుడు విసిరే అగ్గి రవ్వలా- హెచ్చరించే స్వరం దుఖ సాగరమై కెరటాలను ఉసిగొల్పుతుంది ఎగిసి పడే అలలకు ఉలుకెక్కువే ఆశ పడే కలలకు కులుకెక్కువే పడిలేచే కెరటం తడి లేపే స్వరమై ఒడ్డును చుంబిస్తుంది తాటాకు చప్పుళ్ళు బెదిరిస్తున్నాయి ఎముకల గూళ్ళు వణుకుతున్నాయి కుందేళ్ళు పరిగెడుతున్నాయి స్వార్ధానికి వందేళ్లై ! భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్ సిద్ధాంతం ఆపిల్ పండునే ప్రశ్నిస్తే గతి తర్కిక భౌతిక వాదం నాస్తికంగా నిలిచింది నిజమై నిస్తేజంగా! ============ మే 06/2014
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qb4ljz
Posted by Katta
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qb4ljz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి