ఈ శకం నాది ....6.5.14. నువ్వు ఆ ప్రశ్న అడగకుండా వుంటే ఎంత బాగుండేది!? నా పాట సెలయేటి వూటన్నావు మురిసి పోయి మందర పర్వతమెక్కాను నా మాట అమృతపు కలశమన్నావు ఎగిరి గంతేసి చంద్రమండలం మీద గుడారమేశాను నా కర స్పర్శ సుమ దళాల సుకుమారమన్నావు ప్రాణ వాయువుకే చెమటలు పట్టేలా ఉబ్బితబ్బిబ్బయ్యాను అంతలోనే వుత్సాహాన్ని గుటకేస్తూ మీరేంటని అంటూనే నాభుజం మీద వెతుక్కుంటున్నావు అర్థం కాక అయోమయాకాశంలో ప్రశ్న మెడకాయ వొడిసిపట్టే ప్రయత్నంలో నేనుంటే అదికాదు నేనంటున్నది ? మేరేవుట్లని నంగి నంగి సొంగకార్చావు ఇంత ఎదిగిన నేను నీకు జవాబు చెప్పలేక పాతాళానికి పడిపోతానా!? ఈ శకం నాది నేనో త్రివిక్రమ స్వరూప మానవుణ్ణి ఏదో వొకరోజు నువ్వు మూర్చపోకతప్పదు1 భయపడకు! మానవతా తీర్థం నా మదినిండావుందిలే !.!
by Kanneganti Venkatiah
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RoGexK
Posted by Katta
by Kanneganti Venkatiah
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RoGexK
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి