కె.కె.//గుప్పెడు మల్లెలు-73// ********************* 1. నిన్న భూతం,రేపు అనుమానం, నేడొక్కటే నిజం, అందుకే... అది కాలం అందించిన "వర్తమానం" 2. అందరికీ తెల్సిందే జీవితం చిన్నదని, అయినా వీళ్ల దుంపతెగ, తొంగి చూడ్డమెందుకో పక్కోడి జీవితంలోకి 3. అడిగింది లేదని చెప్పకుండా, ఉన్నదేదో తెచ్చేసే హోటల్ సర్వర్లా, అదృష్టం బహుచిత్రం సుమీ 4. బాల్యంతోనే బతుకు ముగిసిపోద్ది, మిగిలిందంతా చావే, కప్పెట్టడమో,తగలెట్టడమో లేట్... అంతే 5. ఇప్పటి బిజీలైఫ్ 120లో పరిగెడుతోంది, చమురుకోసం చూసి 40లోకి తెచ్చామో, చెమట చమురుతో నడపాల్సొస్తోంది. 6. ప్రతీ కుక్కకి ఓ రోజుందట, ఆ రోజు ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో తెలీలా... పాపం. 7. పిల్లల బతుకుల కోసం, బిల్డింగులు కడుతున్నారు, చెట్లునరికి సమాధులూ కడుతున్నారు. 8. "బాలు" మైకు బదులు బ్యాటు పట్టుకుంటే, ఆయనా తిట్టుకునేవాడు నీలాగే, అందరూ ప్రతిభున్నోళ్లే... ఎక్కడుందో తెలీదంతే 9. పుస్తకాల్లో ఆరోగ్యం చదవకు, అచ్చుతప్పు పడిందో... అనుమానంతోనే పోతావ్. 10. చాతీ సంకోచ,వ్యాకోచాలు పీల్చే దమ్ము మీదే, జీవితంలో చీకటి,వెలుగులు కె.కె. నువ్వు చూపించే ధైర్యమ్మీదే ===================== Date: 05.05.2014
by Kodanda Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iWM7Zd
Posted by Katta
by Kodanda Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iWM7Zd
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి