గోస గొప్ప మనసు ఎక్కడో తప్పిపోయింది మనసును వెతుక్కునే మనసులేదు మనసు కూడా పరాయిదైపోయినంక దేని మీదా మనసుండదాయె, నివ్వద్దె మాట్లాడుకుందామని కలుసుకునే రోజులేయి కలుసుకుని కరువుదీర మాట్లాడిందెపుడని వరదకు వొరుసుకపోయిన పంటపొలంలెక్క అన్ని కొట్టుకుపోయి యాది గూడ మిగలనియ్యలె దూపకు దోసిలి పట్టి తాగిన బొక్కెన నీళ్ళు కీసల పైసల పెట్టిన సీసాలనీళ్ళొకటేనా మనసు తండ్లాడతలేదా వూర్లు బోర్లబడ్డయి మనుషులు గొంగళ్ళతోని గాదు గోడలతోని తిరుగుతుండ్రు కడుపుకింత అన్నం చాలనుకునే లోకంగాదు వొడిపిలి పోసి వొడ్లు దొబ్బే వొయ్యారిభామలైండ్రు లక్షలమందున్నాఎవలికివాళ్ళే పట్నంల ఎందుకు ఇరుకిరుకైపోయిండ్రు మనుషులు ఎవరిని చూసినా పైసలపోకడే కనపడ్తది ఎవరి గుండెచప్పుడైనా రూపాయల్లెక్క గల్లుగల్లుమంటది ఓ మంచి లేదు, ఓ నెనరులేదు అంతా దోపిడే కొనుడు అమ్ముడే కాని ఏమమ్మినమని సోయిలేదు ఉగ్గుగిన్నె నుంచి పాడెకట్టెల దాకా అన్ని మందియె ఇల్లు, వాకిలి,చెలక, పొలం, చెట్టు చేమా గొడ్డు గోదా బట్టబాత, బువ్వ, నీళ్ళు మిగిలిన ఆఖరికి ఈ శెత్త గూడ అంగట్ల బెట్టినంక మనసేడుంటది, చచ్చిపోయుంటది మనుషులు పిడాత చచ్చిపోయే రోజులొచ్చినయి ఇంకేం చూసుడు లడాయి చేసి తెచ్చుకోవాలె మనసు
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uuWzk3
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uuWzk3
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి