ఎందుకంటే, నేను ఆడదాన్ని ||మూలం : షహనాజ్ బేగం || అనువాదం : ఆర్.శాంతసుందరి నాకు మాట్లాడే హక్కు లేదు ఏదైనా చెప్పాలనుకున్నా వినటానికెవరికీ ఇష్టముండదు ఎందుకంటే, నేనొక ఆడదాన్ని! ఆడదాన్ని కావటం చేత కిటికీలోంచి తొంగిచూడటం తప్పు గలగలా నవ్వటం అపరాధం గుమ్మం దాటీ బైటికెళ్ళి స్వచ్ఛమైన గాలి పీల్చటం నిషిద్ధం! నేను దేనినీ ప్రశ్నించకూడదు తండ్రి ఆస్తిలో హక్కు అడక్కూడదు నేను పుట్టి పెరిగిన ఇంటిని ఇది ‘నా ఇల్లు’ అని అనకూడదు అసలు తలెత్తి మాట్లాడితేనే తప్పు ఎందుకంటే, నేను ఆడదాన్ని! నా కోసం ఉన్నాయి గోడలు,. గుమ్మం, పరదాలూ, అధిగమించకూడని ఆంక్షల అదృశ్య సంకెళ్ళు - మగవాడికి మాట్లాడే హక్కుంది స్వేచ్ఛగా ఎక్కడికైన వెళ్ళే హక్కుంది నవ్వటానికీ, పాడటానికీ, సంతోషం ప్రకటించటానికీ కావల్సినంత స్వేచ్ఛ ఉంది ---------------------------------->6.5.2014 స్త్రీవాద పత్రిక భూమిక May 2014 issue
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iY7B7Z
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iY7B7Z
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి