పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మే 2014, మంగళవారం

Sravanthi Itharaju కవిత

సౌగంధిక జాజరలు! "పద పంజరం" తొలి ప్రేమ మనసుకు తొలి చినుకు భూమికి తొలివలపుమంట చేతిలో గోరింట పంట మరపురానివి మార్చలేనివి తొలి ప్రేమ మనసును చిగురిస్తుంది తొలి తొలకరులకు అవని పులకిస్తుంది ప్రేమ వర్షంలో వలపు మొలకెత్తుతుంది వర్షపు చినుకులకు విత్తనం చివురిస్తుంది కానీ... పెరిగిన విత్తనపు మొలక చెట్టై తన ఆశ్రితులకు నీడనిస్తుంది మరి వలపుల మొలక ప్రేమతో శ్రద్ధతో పంచుకుంటే పెంచుకుంటే మధుర ఫలాలనుఇరువురకీ అందిస్తుంది లేకున్న మాడి మసై తీరని దుఖాన్ని ఎడబాటునూ కలుగ జేస్తుంది కనుకనే ఒ మానసరాజహంసా! వినుమా! నీవు నరులను కాదు పురుషోత్తముని ప్రేమించుమా.. మల్లెలాగా, మొల్లలాగా.. విరిసిన కుసుమంలాగా..తులసీదళం లాగా హరిచందనం లాగా..పచ్చకర్పూరం లాగా మధురమైన హరి సంకీర్తనంలాగా వాకిట వెలిగే చిరునేతి దివ్వెలాగా ఏడేడుకొండలెక్కి నడచివచ్చే సామాన్య భక్తునిలాగా ఎర్రని తిరునామం లాగా తెల్లని కడిగిన మంచి ముత్యంలాగా పూసిన పునుగు గిన్నె కస్తూరిలాగా పరిమళించుమా పరవశించుమా.. నిముసమైన స్వామిని ఎడబాయక తరియించి తరింపజేయుమా ఇహపరముల ఈ ఆత్మ పరమాత్మను జేరగా ఆథ్యాత్మిక ఆకసంలో హాయిగా విహరించి శ్రీవారి పదపంజరముల తిరముగ వశియింపగా...

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mwY3ch

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి