||శిథిలం|| శీర్షిక : చినిగిన కాగితంపై వ్రాసిన కావ్యం ప్రణయమనే నాగిని కాటేసిన జీవితం!! అటువంటి జీవిత పతనానికి గల కారణాల విశ్లేషణ నేను వ్రాసిన ఈ కవిత్వం. ప్రేమలో మోసపోయిన ప్రతి ప్రేమికుడికీ అంకితం నా ఈ "శిథిలం"!! మంచు అక్షితలే కురిసేవి నీతో సాగే పయనంలో.. మలయమారుతాలు వీచేవి నీతో గడిపే సమయంలో.. పన్నీటి జల్లులు తుళ్ళేవి నిను చూసే తరుణంలో.. అలా ఊహకందని ఓ అందమైన జీవితాన్ని కాదంటూ.. కుదరదంటూ వెల్లిపొయావు.. వాస్తవాలన్నీ వికృతంగా వెక్కిరించేలా నీ వియోగంతో నిదురలేచిన నాకు కల్లోలమైన లోకాన్ని పరిచయం చేసింది అనుక్షణం కన్నీటికి నానినాని తడిచి ముద్దైన నా కనుపాపలను వదిలి వెళ్ళలేక కొలువై ఉన్న నీ రూపం!! ఆ క్షణమే గ్రహించాను.. జాలి ఎరుగని విధి ఆగ్రహాన్ని.. నిజానికి నేను నడిచింది ఎడారి త్రోవలో ఎండమావులతో నిండిన ఎండాకాలమని, అడుగు సైతం వేయలేని ముళ్ళదారని, కరుణలేని కానరాని కటికచీకటని, నీ అనుగ్రహానికి నోచుకోని నా జీవితానికి మిగిలింది గ్రహణమని నేనొక వెలుగెరుగని కలుగు వాసినని.. మదిగదికి జీవిత ఖైదుని విధించి విషాద ఊబిలో చిక్కుకుపోయి అనాథగా మిగిలిన అసమర్థుడనని.... కానీ అడగకుండా ఉండలేకపొతున్నాను అతి మధురమైన తల్లి ప్రేమని అనిర్వచనీయంగా చూపుతారు కదా, హృద్యమైన అనురాగ బంధంతో ఒక కూతురిగా తండ్రిని ప్రేమిస్తారు కదా, తోబుట్టిన అన్ననీ, తమ్ముడినీ అక్కున చేర్చుకుని సాకుతారు కదా, మనువడి కాలు కందకుండా ముద్దాడుతూ మోసుకు తిరుగుతారు కదా, జీవితమంతా ఇందరి మగవాళ్ళని ఆదరించి ఒక్క ప్రియుడి విషయంలో మాత్రం ఎందుకని కనికరించరు?? అవునులే మనకు రక్త సంబంధం లేదు కదా మమకారం అనే మత్తుని పరిచయం చేసినా ఆప్యాయతనే ముసుగులో అవిటివాడిగా మార్చినా ప్రతిక్షణం సఖియే ప్రపంచం అన్నట్టు ఏమార్చినా ఒక్కసారిగా ప్రేమశిఖరాగ్రం నుండి నయవంచన కావించి నట్టేటిలోకి తోసేసినా అడిగేవాడు ఉండడు అనే ధైర్యం నీది.. పొరపాటున అడిగినా సరే.. మగాడివి నువ్వు, ఆత్మహత్య చేసుకోటానికి సిగ్గులేదా అని నీ తప్పుని మరిచి నాదే ఒక తప్పని నిరూపించే సమాజం మనది!! అయినాసరే.. నా ఒటమికి నాదే భాద్యత.. ఎందుకంటే, ఒట్టేసిన చేతికి తెలియదు పాపం తను కేవలం చేతకాని చెయ్యిని అని, నీ చేతిస్పర్శ మంట పుట్టించే ఒక చురకని...! చూసిన కంటికి తెలియదు పాపం తను చూసింది కేవలం పైపైన మెరుగులని, నిలువెత్తు నిఖార్సైన నకిలీలేని బంగరం కాదని...! వింటున్న చెవికి తెలియదు పాపం చిలిపిపలుకుల ఆంతర్యం చైత్రంకాక శిశిరమని, మాటలతో ప్రణయాన్ని మదించటం సులభమని...! అన్నింటికిమించి నా హృదయానికి తెలియదు పాపం మన ఎడబాటుకి, నా ఎదపోటుకి కారణం నువ్వని, నీ జ్ఞాపకాల గాయాలకు ఛిద్రమైన తాను ఒక శిథలమని!! #సంతోషహేలి 01APR14
by Santosh Kumar K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gkksQS
Posted by Katta
by Santosh Kumar K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gkksQS
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి