సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ’’ప్రేయసితో సంభాషణ‘‘ అన్నఅర్ధానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. ఐదవ విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఇప్పటికి ఇరవై ఆరు షేర్లు అయ్యాయి. 22వ షేర్ మత్లాగా రాసాను. మత్లాతో కలిపి చదివితేనే గజల్ అందం. గజల్లో ప్రతి షేర్ దానికదే స్వతంత్రంగా ఉంటుంది, కాబట్టి ఇలా ఒక యాభై లేదా వంద వరకు షేర్లు రాయాలన్నది ఆలోచన. ఈ ప్రయత్నం ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. దరహాసం విరబూసిన జాజిమల్లె లాగున్నది చెంపలపై చిరుసిగ్గే మందారం లాగున్నది గుండెల్లో ప్రవహించే చిరునవ్వుల సుమధారలు నరనరాన హాయినిచ్చే ఉత్సాహము లాగున్నది నడుం చుట్టి ముడివేసిన పైటకొంగు గర్వంగా మల్లెమొగ్గపై జారే మంచుబిందు లాగున్నది అలలాగా ఊహల్లో అందమైన వదనాన్నే చూస్తుంటే జీవితమే పూలరథము లాగున్నది నగుమోము అలకల్లో తగ్గదుగా సౌందర్యం అప్పుడపుడు తప్పవుగా పరీక్షలు లాగున్నది
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PeJawm
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PeJawm
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి