పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఏప్రిల్ 2014, మంగళవారం

బ్రెయిన్ డెడ్ కవిత

మృదువుగా , మధురం గా కవిత ని కవిత లా రాయాలన్న విశ్వప్రయత్నం లో ఇంకో సారి ఓడిపోతూ ............... నిశీధి | దురాశ | జీవితం ఒక్కసారి హత్తుకో నన్ను మనస్పూర్తిగా , మరో ఆశగా తడికళ్ళతో తమకంగా తత్వాలకి తపనలకి దూరంగా నాలో నన్ను వెతుక్కునే ప్రయత్నం ఫలించేలా తెలియక వేసిన తడబాటు అడుగులు మధుర జ్ఞాపకాలై తెలిసిన మెలుకువ ఒప్పులు ముందుటడుగుల్లా మిగిలిపోయేలా కళ్ళ పుసుల్లా కరిగిపోయే ఊసులుగా కాకుండా కంటి రెప్పలా మిగిలే ఇంకో ఉదయాన్నివ్వు నిద్ర లో ఉలిక్కిపడే పసితనం ని జో కొట్టే అప్యాయతవవ్వు పువ్వులో నవ్వు చూడగలిగే నవ్వుల వెనక దాగున్న బాధ అర్ధం అయ్యేలా మృదుత్వాన్ని ఒక సారైనా ఇవ్వు తీరని కోరిక అంటావా ? హుమ్మ్ నా నిన్నుగా నీతో కలిసి నీతో పాటు ఓడిపోతూ నాలో నిన్ను గెలిపిస్తూ నీ భయాలు వేదనలు నాలో దాచుకుంటూ ప్రయాణిస్తూన్నానుగా ఆ మాత్రం చేయలేవా? నా కోసం ? ఒక్కసారి మెత్తగా హత్తుకోలేవా ? బాధలన్ని బరువు తగ్గిన మేఘాల్ల్లా కరిగి కన్నీటిలో జారి పరుగులెత్తేలా కౌగిలించుకోలేవా ? నిశీ !! 30 / 03 / 14

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mkPkWB

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి