జయ గీతిక మండే ఎండల్లో నల్లటి కోయిల సల్లటి చెట్టై పాడుతున్నట్టు.. ఆ.. సందు మలుపు తిరగంగానే గుండెలోకి ప్రాణం తిరిగొస్తుంది గుప్పెడంత ఆశ చిగురేస్తుంది యాసంగి బీడుల్లో వసంతం పురుడోసుకున్నట్టు.. పూలపాన్పులను పరచి, మధుపాత్రలు కూర్చినట్టు.. ఆ సందు మలుపు తిరగంగానే అడవి మల్లెల వాసన గుప్పుమంటుంది ఆకాశం ఆశల పందిరవుతుంది అమవస నిశిలో ఆకసానికి కాటుకద్దినట్టు.. సుక్కల వెలుగులో సినీవాలి సుట్టూ పరుసుకున్నట్టు... ఆ సందుమలుపు తిరగంగానే సల్లగాలులు సెమటసుక్కలతో నెయ్యమొందుతుంటాయి.. మనసు సెలిమెలో ఊసుల గలగలలు వినిపిస్తుంటాయి.. సుక్కలన్ని ఒక్కటై సూరీడై మొలిసినట్టు.. సుట్టూరా సీకటిని సూరులోకిజెక్కినట్టు ఆ సందు మలుపు తిరంగానే మనుసు మబ్బుల్ల కొత్త పొద్దు పొడుసుకొస్తుంది.. కనులముందు.. వుగాది పరుసుకుంటుంది.. ... చిన్నికృష్ణ
by Chinni Krishna
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN9tp
Posted by Katta
by Chinni Krishna
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN9tp
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి