పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మార్చి 2014, మంగళవారం

Sriramoju Haragopal కవిత

కేన్వాసుమీద... పేరంటాలపల్లి కొండవాగు పుట్టినదగ్గరికి పరుగెత్తినపుడే ఆ అడివిలోనే ఎందుకు తప్పిపోలేదు నేను విశాఖసముద్రంలో కెరటాలెత్తుకెళ్ళినపుడే ఓడనైపోవాల్సుండెకదా అరకులోయలో జలపాతాల దగ్గరే వాననై ఎందుకుండిపోలేదు నేను ఆదిలాబాద్ కనకాయ్ లో కడెంనదిలో నీళ్ళలో చేపలా ఎందుకు జారిపోలేదారోజే చిలుకలగుట్ట శివార్లలో తిరిగినపుడే జంపన్నవాగులో జనంలో తప్పిపోలేదెందుకు అర్ధరాత్రి వెన్నెల్లో విసునూరుబాటల్లో ముచ్చట్లలో కాటగలిసిపోలేదెందుకు గోదావరినదిలో ముఖంచూస్కునే పాపికొండల్లోనే ఎందుకుండిపోలేదు అమరావతి ఒడ్డున కృష్ణలో జారినపుడే మునకలేయలేదెందుకు నైనిటాలు నుండి రామేశ్వరం దాకా ఎక్కడో తప్పిపోవలసిన వాణ్ణే మళ్ళీ ఇంటికి చేరగానే అన్నీ జ్ఞాపకాలు మైలురాళ్ళయినయి ఉత్తవూళ్ళే కావుకదా మనుషులు కదా, నేస్తాలు, రక్తనేస్తాలు, ఆత్మీయనేస్తాలు, గోర్వెచ్చని అశ్రునేస్తాలు అందరి గుర్తొస్తరు కదా చేసిన వాగ్దానాలకు బందీలం కదా తీరని కలలకు బంధువులం కదా బతికిన తీపి కథలు కొందరివి బతకడమే తీపి కల కొందరికి బతుకుంటేయాత్ర కాదు పోరాట ప్రస్థానం కొందరికి నేను వాళ్ళబాటలో పరచుకున్న మట్టికవిత్వపుపొరను నేనిపుడు ఎక్కడ తప్పిపోనక్కర లేదు

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h2qry9

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి