మరువం ఉష | అనుకోని ఘటన ------------------------------- దీపాలు ఆర్పుతూ వస్తుంటావు నిన్ను అనుసరిస్తూ చీకటి పాదాలు ఇంకాస్త తెల్లగా వెక్కిరిస్తుంది వీధివాకిట్లో సందె ముగ్గు సర్దని పక్క మీద మడతల్లో చీకటి వానపాముల్లా కదులుతుంటుంది, నిన్ను అలుముకుంటూ చిక్కని గుబులు. మిగిలిన ఆ చిరుదీపపు నీలి కాంతి లావాలా నీ గదిలోకి ప్రవహిస్తుంది ఎక్కడా ఆధారాలు వదలని మార్పు ఇక్కడే దాగివుంది ఎప్పటిమాదిరే అద్దం వైపు చూసుకుంటావు నీలాంబరం జాడలు మాయమౌతున్నాయివాళ నిన్న పగిలిన అద్దపు ముక్కల్లో నెత్తుటి ప్రతిరూపం చీకటి చాటున నీ మరుపుకి కట్టిన రుసుం ఆర్తనాదాలు ఇక్కడ ప్రతిధ్వనించవు సౌండ్ ప్రూఫ్ గుండె మార్పిడీ జరిగింది మధ్యనే- ఇకిప్పుడు, ఆ నిర్జన వాడల్లో వసివాడిన పూదోటలు, నిర్దయ జాడల్లో చిన్నబోయిన నీ కనుపాపలు 12/03/14
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OmwEu0
Posted by Katta
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OmwEu0
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి