పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మార్చి 2014, బుధవారం

Abd Wahed కవిత

గుండెనేల సరికొత్తగ పచ్చికేదో మొలిచింది చిరుగాలే తొలకరినీ ఆత్రంగా పిలిచింది ఎండల్లో నీడలను వెదుకుతున్న సెలయేరు గట్టుచేయి పట్టుకుని ప్రాణంగా వలిచింది గోడమీద చిరునవ్వుల మాట్లాడని చిత్రమే కంటిలోన కలల ఇంటి పునాదిగా నిలిచింది పెనుచీకటి భావాలను తొలికిరణం ఛేదించి రాతిశిలను స్వచ్ఛమైన అద్దంలా మలిచింది ఏకాంతం గూటిలోన పక్షిలాంటి జ్ఙాపకం చెట్టులాంటి మౌనాన్నే మాటలుగా తొలిచింది వెన్నెలనే దుప్పటిగా కప్పుకున్న తోటలో మంచులాంటి దియాతలపు పూలమనసు గెలిచింది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OmwEtW

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి