శ్రీ వెంకటేష్ గారు రాసిన కవిత !!---మరణం---!! కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ మరణం జీవితానికి ఆఖరిమెట్టు. వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని అది అన్నిటికన్నా అద్బుతమని తాత్విక భావన ల తో సాగుతుంది . ప్రతి మనిషికీ మరణం తప్పదు దాన్నుంచి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు, కాని అసలు మరణం అంటే ఏమిటి, మరణం తరువాత జీవితం వాటి తో ఉన్న బందం తెలుసుకోవచ్చునా ? మరణం దేవుడిచ్చిన వరం.. మరణం అనేది ఈ జీవితానికి చివరి దశ ఒక రకం గా గమ్యం (destiny) అని చెప్పొచ్చు , మరణం కూడా నిద్ర లాంటిదే ...బతుకున్నపుడు తాత్కాలికం, అది మరణం తరువాత శాశ్వతం మరణం ఒక గమ్యం//చేరితే నిద్రలో దొరికే సుఖం శాశ్వతం పునరపి జననం, పునరపి మరణం జీవి పుట్టటం గిట్టటం ...కాల చక్రం లో జరుగుతూ ఉండేదే కదా, తాత్విక ఆలోచనలో చూస్తే నిజమే మనిషి పుట్టుక తరువాత మలి ప్రయాణం మరణం వరకే, అది సత్యం కూడా... మరణం ఒక జననం//జన్మించాక మళ్ళీ మన గమ్యం మరణం మరణాన్ని ఎవరైనా చూడగలరా తమకు తాము ఫీల్ కాగలర , అదో అద్బుత ప్రపంచం కను మూసే వరకు జరిగే సంఘటనల సమూహం, మరణం ప్రతి మనిషి ని నడిపించే సైన్యం వంటిదా కావొచ్చు .....ఓ జీవితాన్ని గురించి ఎంత నేర్చుకోవచ్చో, ఒక మరణాన్ని చూసి కూడా అంతకన్నా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇది వాస్తవం మరణం ఒక సైన్యం//ఒకరికి మాత్రమే కట్టుబడి పని చేసే సైన్యం మరణం ఒక ప్రపంచం..కనురెప్పల ఎడబాటులో కనపడని//కనురెప్పల స్థిర కలయికలో దాగలేని ఒక అద్భుత ప్రపంచం// మరణాన్ని ప్రేమించాగలిగే గొప్ప తాత్వికత వుంది అంటే అది అద్బుతమే, మరణాన్ని ప్రేయసి గ ఉహించడము కొంచం కష్టమే. మనిషి పోయాక కాల్చేసిన కట్టే నుంచి పుట్టే జీవితపు అనుభవాల బూడిద నే మరణం, మరణం ఒక మన్మధయాగం//కాలే కట్టె రగిలే శరీరపు రాసక్రీడలో బూడిదను జన్మింపజేసే ఒక మన్మధయాగం నిజంగా మనిషి కి ఇచ్చన గొప్ప వరం మరణం....ఈ లోకం లో ఎన్నో ఘోరాలను నేరాలను , కుళ్ళు ను , అబద్దం మోసపూరిత లోకానుంచి దూరం చేసేది ఏది అయిన వుంది అంటే అది మరణమే. మరణం విడదీయరాని బందం మరణం ఒక అదృష్టం//మనిషిని చంపి//అబద్ధపు కళ్ళతో నిజాన్ని చూసే లోకానికి దూరంగా బ్రతికిపోగలిగేలా చేసే అదృష్టం......// పుట్టుక, మరణం రెండూ మనిషిలోని అంతర్భాగాలు.మొదటిచూపు ఎంత అవసరమో ` ఆఖరి చూపూ అంతే అవసరం. ఈ కవిత ని చదివినపుడు రాజేందర్ గారు రాసిన "ప్రస్తావన" గుర్తుకు తెప్పిస్తున్నది ....మనిషి లో ని అంతరంగాన్ని , మరణ భావన అనేది భయపడే వస్తువు కాదని చాల చక్కగా వివరించారు వెంకటేష్ గారు. వారి కవితల్లో మంచి కవిత ఇది. విబిన్న కోణాలను స్పృశిస్తూ మరిన్ని మంచి కవితలను అందిచాలని కోరుతూ .. అబినందనలతో .. మార్చ్ 12, 2014 మరణం ఒక గమ్యం చేరితే నిద్రలో దొరికే సుఖం శాశ్వతం మరణం ఒక జననం జన్మించాక మళ్ళీ మన గమ్యం మరణం మరణం ఒక సైన్యం ఒకరికి మాత్రమే కట్టుబడి పని చేసే సైన్యం మరణం ఒక ప్రపంచం కనురెప్పల ఎడబాటులో కనపడని కనురెప్పల స్థిర కలయికలో దాగలేని ఒక అద్భుత ప్రపంచం మరణం ఒక మన్మధయాగం కాలే కట్టె రగిలే శరీరపు రాసక్రీడలో బూడిదను జన్మింపజేసే ఒక మన్మధయాగం మరణం ఒక బంధం మనతో పాటే పుట్టి మనతో పాటే చచ్చే విడిచి వెళ్ళని విడదియ్య సాధ్యం కాని మర్మబంధం మరణం ఒక అదృష్టం మనిషిని చంపి అబద్ధపు కళ్ళతో నిజాన్ని చూసే లోకానికి దూరంగా బ్రతికిపోగలిగేలా చేసే అదృష్టం...... మరణం ఒక బంధం మనతో పాటే పుట్టి మనతో పాటే చచ్చే విడిచి వెళ్ళని విడదియ్య సాధ్యం కాని మర్మబంధం మరణం ఒక అదృష్టం మనిషిని చంపి అబద్ధపు కళ్ళతో నిజాన్ని చూసే లోకానికి దూరంగా బ్రతికిపోగలిగేలా చేసే అదృష్టం......
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1frAEnC
Posted by Katta
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1frAEnC
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి