కలలోసుందరి -------------- నేను తల ఎత్తి చూశా నాకు తన చెంగు చివర వేళ్ళాడుతున్న ఒక దారం తగులుతోంది.. తన అందం ముందు నేను చిన్నవాడ్నైపోయా.. తను నడుస్తోంది.. దొరుకుతుందో లేదో అని పోకిరీలో మహేష్ లా పరిగెత్తి ఆ దారాన్ని పట్టుకున్నా.. అలా ఆ దారానికి వేళ్ళాడుతూ పైకి ఎకి ఎక్కు తన భుజం మీద నిల్చుని ఈలలేస్తున్నా నన్ను చూడమని.. అదేంటో అప్పుడు ఈలలు తప్ప మాటలు రావట్లేదు మరి.. కానీ తను అప్పుడే కాలుకి ఏదో అడ్డుతగిలి పడబోయింది.. ఎక్కడ పడుతుందో అని కంగారు పడుతూ పడిపోకుండా పట్టుకుందాం అని చేతులు చాచాను.. కాళ్లకింద పడిన తన చీర అంచుని సరిచేసుకునే లోగా నేను అమాంతం జారి అలా పడిపోతూ లేచాను.. నిదుర లేచాను..! - ఇట్లు నీ నేను సత్యం గడ్డమణుగు, 12-03-2014, 18:34
by Gaddamanugu Venkata Satyanarayana Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cxlRbA
Posted by Katta
by Gaddamanugu Venkata Satyanarayana Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cxlRbA
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి