సౌగంధిక జాజరలు "ఏడుకొండల స్వామీ.." _ స్రవంతి ఐతరాజు ఏడుకొండలస్వామీ నిను ఎలుగెత్తిమ్రొక్కెద అడుగడుగు దండాలతో గండాలు దాటింప నీ నామ స్మరణము..నీ "నామ"ధరణ చేసెద తనదు ఏడెడూ జన్మాల పాపంబుల బాపింప వ్రేడెద పిలుపు వినవా నా స్వామీ! ఏలుకొన రావేమీ? అందాల నా విభుడు అస్వస్థుడైనాడు.. జన్మజన్మాంతర పాపకర్మల బాధింపబడుచున్నాడు కావవా మము ఓ కావేటి రంగా! నీకల్యాణపురిని మా కల్యాణము గావించితివి ముడుపుగట్టితినీకు మా ముద్దుమురిపాలు నా సగమాయువు నా రేనికి బోయుమా అనిల అనుమానపు అవమానపు చాయల అలసిసొలసిన ఆ గుండియకీయగరాదె నీ అమృత శీతల కర స్పర్శ కరుణింపగరాదె పాపుల నీ పద పద్మముల సేవింప ఏడెడు కొండలెక్కి నీ నగుమోము గాంచెద నాదుముడుపులు చేకొని నాధుని రక్షింపుమా నాధా శ్రీనాధా జగన్నాధా పాహిమాం పాహి పాహి!!!
by Sravanthi Itharaju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ppolyz
Posted by Katta
by Sravanthi Itharaju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ppolyz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి