పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మార్చి 2014, బుధవారం

Kranthi Kumar Malineni కవిత

తడి ఆరని తలపులు || క్రాంతి కుమార్ మలినేని || 12.03.2014 నాది అని చెప్పుకునే ఈ జీవితంలో గతం అని చెప్పబడిన దాంట్లో కొంతకాలం నేను అచ్చంగా నాలాగే బతికాను అది నీ దగ్గరే అని చెప్పుకోడానికి నాకు ఏ సందేహం లేదు నా కోపాన్ని నువ్వు చూసావు ప్రేమనీ చూసావు నవ్వునీ, ఏడుపునీ బలాన్నీ, బలహీనతనీ దేన్నీ నీ దగ్గర దాచుకోకుండా బయటపెట్టాను. శత్రువు అనుకున్నోల్లకంటే గొడవెక్కువ పడింది నీతోనే అందరికన్నా ఎక్కువ కసిరినా, తిట్టినా నిన్నే తప్పు నాదైనప్పుడూ నీదే నీదైనప్పుడూ నీదే అన్నిటినీ నువ్వు నీ మంచి మనసుతో చూసావు నన్ను మంచివాడ్ని చేసావు అంతే అప్పటిలా ఉండలేక పోయినా కాలం మన మద్య దూరాన్ని పెంచినా నువ్వు పెంచిన మంచి నాలో ఎప్పుడూ అలాగే ఉంది నీతో నడిచిన గతం తాలూకూ జ్ఞాపకాల్ని మనసూ మెదడూ కలిసి తరచుగా నెమరేస్తూనే ఉంటాయి నువ్వెక్కడున్నా నేనెక్కడున్నా స్నేహం మనిద్దరినీ అనుసరిస్తూనే ఉంటుంది పలకరిస్తూనే ఉంటుంది ఏదో ఇంకొంత కాలం నువ్వు నాకో, నేను నీకో చెప్పకుండ వెళ్ళిపోయే వరకూ ఈ స్నేహం ఇలా సాగిపోవాలని నీ నేస్తం

by Kranthi Kumar Malineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OlwIdu

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి