తిలక్/అ(నిశ్శబ్ధం) ---------------------------- 1/నువ్వు నేను రెండు శరీరాలు పక్కపక్కగా పడుకున్నపుడు నా చేతులు లతల్లా నిన్ను అల్లుకుంటాయి నువ్వు నాలో బంధీవి కావు ఓ బాంధవ్యంలా 2/నేను నీ ముఖాన్ని ఓ పసికూనలా అరచేతుల్లోకి తీసుకున్నపుడు నీ వెచ్చని శ్వాసకు నా కనురెప్పలు వాలిపోతుంటే సహస్ర ఎడారుల్లో అప్పుడే తిరుగాడి అలసిపోయిన ఓ బాటసారిలా నేను నీ కౌగిళ్ళలో సేద తీరుతున్నట్టుగా 3/నా రెక్కలను అదిమినన్ను గట్టిగా హత్తుకున్నావు చూడు క్షణాల్లో చనిపోవడం అంటే ఇదేనేమొ 4/నా ప్రాణం అంటూ ఏది లేని కొన్ని నిమిషాలు నీలో ఏకమైనప్పుడు అప్పుడు నువ్వంటావు... నేను లేకపోతే ఏంచేస్తావని 5/అన్నం జిగురులా పెగలని నా పెదవులు ఒక్కసారిగా నిశ్శబ్దంలో బిగ్గరగా రోదిస్తుంటే నీకు వినబడేలా...నన్ను దగ్గరకు తీసుకొని నువ్వంటావు ఇప్పుడేమైదని ఇంకొన్ని క్షణాలు నీలోనే కరుగుతానుగా అని నువ్వంటుంటే 6/స్థంబించిన ఓ చెట్టులా నేను భళ్ళున కూలి పడ్డట్టుగా అనిపిస్తుంది 7/ఇప్పుడు మళ్ళా ఒకసారి నీ పక్కగా పడుకోవాలి కొంచం ప్రేమను పులుముకోడానికి ఈ రాత్రికి. తిలక్ బొమ్మరాజు 11.03.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ggjVU6
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ggjVU6
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి