పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మార్చి 2014, మంగళవారం

Aruna Naradabhatla కవిత

వృద్ధి _______అరుణ నారదభట్ల ఎంతకాలం అభివృద్ది బాటలోనే సాగుతాం వందేళ్ళు గడచినా నేర్చుకుంటునే ఉన్నాం! కాలాలు నల్లమబ్బుల్లా పరుగెడుతూనే ఉన్నాయి జీవితాలు కుప్పలుగా కూలడం గమనించావా!?! ఎన్ని కాగడాలో పథకాలై పరిచినా గుడిసె మేడయి కూచుందా...! రాచరికం రాజకీయమై రంగురాళ్ళలా పేరుకుపోతుంది! నడుస్తున్న వారసత్వం జీన్స్ తొడిగి నూతన భాష్యం చెబుతుంది! పెరిగే వృద్ధి రేట్లు కేవలం కొందరి లెక్కలే... వసుదైక కుటుంబపు రహదారి కింద కంకర రాళ్ళై నలిగిపోయే ఇసుక తిన్నెలను ఎప్పుడైనా పలకరించారా! సాఫ్ట్ వేర్ ఆడిన పాచికలో పెరిగిన ధరలను ఎన్నడైనా మాటాడిస్తే తెలిసేది పేదరికపు ఆనవాళ్ళు! భూమీ చిన్నది... అయినా మోసే స్థాయి కంటే ఎక్కువే మోస్తుంది... ఇసుకా చిన్నది అయినా భవంతులై మోస్తుంది ఇక్కడ అభివృద్ధీ అంతే....పేద..మధ్య తరగతులు భారాన్ని మోసి పన్ను కడితే రాజ్యమై నిలబడుతుంది! ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే... చెందిన దేశం ఎన్నడవుతుందో...మరి ఇంగ్లీషు రాజ్యలను వీసాలై ఆహ్వానించడానికి! 11-3-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iwBZg8

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి