పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మార్చి 2014, మంగళవారం

Yasaswi Sateesh కవిత

యశస్వి.. ఎన్నికల లోగిళ్ళలో.. ఎదురుచూపులు చాలిక తెరతొలగించి చూపించాలి మొదలైంది డచ్చాల యుద్ధం రంగం సిద్ధం చూస్తున్న వారిప్పుడూ.. మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు ఈలలు వేసి గోల ఆడేవారే చేస్తున్నారు జీడిపప్పు తిని బలిసిన పందెం కోళ్ళు బరిలో నించున్నాయ్ ప్రయాణంలో, పనివేళల్లో.. కాలక్షేపం కబుర్లు బోలెడు పేపరు నిండా కాలక్షాపం బఠాణీలే చోద్యం పంచడానికి తోడున్నాయిగా మన ఛానళ్ళు ప్రజలంతా ఎవరినో గెలిపించడానికి సిధ్ధమైపోయారు లేదా తాము ఓడిపోవడానికి సిధ్ధమైపోతారు ఏమీ అడగలేక పోతారు అయాచితానికి ఆశపడిపోతారు చూపున్నా దృష్టి లేక బ్రతికున్నా స్పృహలేక ఆకలికి తాళలేక బరువుకీ కరువుకీ తాయలాలకై తొందరపడిపోతారు ఎన్నికలలనో పోగేసిన మాటల్ని నెమరేయలేక కలల్ని కనే అవకాశాన్ని వదిలిపోతారు అలవాటైన చీకట్లోకి నడిచిపోతారు.. కవీ! గోరీలు తవ్వి లేపనక్కరలేదు.. బ్రతికున్న మనుషులేగా మనవాళ్ళు! అయోమయంలో వారి ఆనవాళ్ళు ఎన్నిక చేసుకునేది మనుషుల్ని కాదు ముందురోజుల జీవితాన్నని.. మరలచెప్పు. అమ్మ-నాన్న, ఊరూ-కులం, భాష- ప్రాంతం పుట్టుక- చివరికి నువ్వు మగో- ఆడో నిర్ణయించుకునే అవకాశం కూడా లేకుండానే ప్రయాణం మొదలెట్టాముగా! నీపరమైన వన్నీ గౌరవించే మనసున్నోడివి బతుకు బండి నడిపే వాడిని ఎన్నుకోమని అడిగితే తలదించుకు పోతావే? అని కదా మనం అడగాలి!! ఓటు కోసం వచ్చిన వాడ్ని ప్రశ్నించమని చేప్పేవి- చేసేవి చిట్టాల తూకం వెయ్యమని మరలచెప్పు మన మనిషికి గొంతెత్తి పిలువ్! వెలుగు దారి తొక్కమని ==11.3.14==

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N3slTl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి