(^^^) మట్టి నేల పైన నింగి గొడుగు క్రింద నేల అరుగు మధ్యలో నడిచే చెట్లు మనుషులు వాన చెలికాని కౌగిటచేరి నేల ఏటా నిండు చూలాలౌతుంది అనుకోవడం తప్పు ఆమె నిత్యం పచ్చి బాలింతై పురిటి నొప్పుల తిప్పలు పడుతూనే వుంది నిజం చెప్పాలంటే మనం మట్టి మనుషులం కాదు కాదు మట్టిలో కలసిపోయే మనుషులం మట్టిలో పుట్టి మట్టిలో పెరికి మట్టిలో పోతాం కాబట్టి ఇందులో నిర్జీవుల పాత్ర వుంది సజీవుల యాత్ర వుంది మట్టి కడుపులో ఎన్ని ఆకు పచ్చ భూగోళాలు దాగి ఉన్నాయో విత్తు నాటామో లేదో అది పచ్చని ఆకుల హస్తాలతో నమస్కరిస్తూ పైకి లేస్తుంది మట్టి మనకు మెతుకౌతుంది బ్రతుకౌతుంది తన కడుపులో నాగేటిని గుచ్చి గుచ్చి దున్నినా తన ఉదరంలో ఎన్ని గడ్డపారలు తెచ్చి పెళ్ళగించినా నవ్వుతూ నవ్విస్తూ తాను మాగాణి పొలమై చినుకుల కునుకులకు మురిసి సిరుల మొలకౌతుంది మట్టి అమ్మై ఆకలి తీరుస్తుంది ప్రాణ చిలుక కాస్త ఎగిరి పోయాక ఈ కర్మ సంచిత దేహాన్ని పంచ భూతాల గేహాన్ని తన కడుపులో దాచుకొంటుంది చివరకు అంతా మట్టే అన్న నగ్న సత్యాన్ని చెప్పకనే చెబుతుంది. :putnam: కంచర్ల
by కంచర్ల సుబ్బానాయుడు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd5e4O
Posted by Katta
by కంచర్ల సుబ్బానాయుడు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd5e4O
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి