కాపిశ్కెడు నెనరు పిడీలు గడిచినయి పిడికెడు దయగలిగిన మనుషులు పిడికెడుగూడ దొరకలే దోసెడు దోసెడు కన్నీళ్ళు తాగి ఆశలు దూసిన బతుకుచెట్టునీడల ఎండిపోయినయి చల్లటి అయినోల్లనీడలు ఎవల్నడుగాలె బాధలెందుకుంటయని మొగులొడ్డున పొద్దొకనది యెలుగు, మాపొకనది సీకటి బురద బురద కప్పు తొర్రల్లో చిక్కిన యాదిచుక్కలు పొయ్యిల కొర్రాయిలెక్క చిటపట యిడిచిపోయినోల్లె కాని వున్నదెవరుతోడు? పుటుకపొద్దు, సావుమునిమాపుల నడుమ చానా ముచ్చట్లు కతలుగ చెప్పడానికే నిజం మనం కలిసి బతికిన రోజులన్నిట ఆత్మగల్లలోకం వొకటుంటదనే భావుకం, నీకు నాకు నడుమ వెలిసిపోని పావురం దుక్కం మొగురమై గుండెల్లో దిగబడితే బొమ్మరిల్లు బొమ్మయిల్లే తండ్లాడి పేర్చుకన్న బతుకమ్మయితే బతుకు పిడీలకవుతల కూడా ప్రేమలచేన్లే పండుతయి
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i3zFd5
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i3zFd5
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి