పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మార్చి 2014, బుధవారం

Mohammad Abdul Rawoof Chinni కవిత

" చిన్ని " // నేటి ప్రపంచం // ================= రెండు చేతులు భగవంతుని వైపు చూపి తినడానికి తిండి లేక పనిచేసే ఓపికలేక ఎముకలలో సత్తువలేక ఎండిన డొక్కలతో వొంగిన నడుముతో బ్రతుకు జీవుడా అని ఒకవైపు తల్లడిల్లిపోతున్న ప్రాణాలు బ్రతుకుతుంటే మందు బాబుల మాయా ప్రపంచం మత్తులో ఊగుతుంది ధూమపానంతో దద్దరిల్లి పోతుంది పొగాకు పేరుతో ప్రక్కదారి పడుతుంది కుల, మత, వర్గ విభజనతో హోరెత్తిపోతుంది ఒకడి ఇంట్లో అన్నం తినడానికి గురుతుకురాణి కులం వాడికి న్యాయం చేయమంటే గురుతుకొస్తుంది. ఒకడి దగ్గర డబ్బులు తీసుకోవడానికి అడ్డం రాణి మతం వాడికి సాయం చేయమంటే అడ్డుపడుతుంది తల్లి, చెల్లి లాంటి సాటి ఆడపిల్లని చులకనగా చూస్తుంది పసిబిడ్డలని పోత్తిల్లలోనే చంపుకునే విష సంస్కృతితో అల్లాడిపోతుంది ప్రేమ, ఆప్యాయత, మనసు, మమత మరిచి మాయ మాటలు నేర్చుకుంటూ విషపు భీజాలు నాటుతుంది ఇదేనా సమాజం...ఇదేనా ప్రపంచం భగవంతుడా...! చిమ్మ చీకటింట్లో చందమామ బ్రతికినట్లు కారు చీకటిలో మినుగురు మెరిసినట్లు ఎదురీది పోరాడే జీవితం (శక్తి) ని మాకివ్వు. @ చిన్ని @// 05-03-2014

by Mohammad Abdul Rawoof Chinni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f7hPBh

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి