అంతా.. అదృష్టం కనుపాపల ఆకాశంలో తూనీగల్లా ఎగురుతున్న కలలను ఆపగలవా? పసిపాప నవ్వులా కనురెప్పలపై వాలే నిద్రను వదలగలవా? కాస్త నిద్ర అమ్ముకుని కొన్ని కలలు కొనుక్కో... జ్ఙాపకాల సముద్రంలో ఒక కెరటంలా ఉవ్వెత్తున లేవగలవా? ఒంటరి ఊళ్ళను ముంచెత్తగలవా? కొన్ని క్షణాలను చంపయినా ఒక్క జ్ఙాపకాన్ని బతికించు... ఎర్రని గుండెలో సప్తవర్ణాల ఇంద్రధనుస్సులా కట్టుకున్న గోడలను కూల్చగలవా? చిరుగాలిలా సీతాకోక చిలుక రెక్కవిప్పనీ... గొంగళిపురుగు సంకెళ్ళు తెగిపోతాయి... పాదాల కింద నేల ప్రవహిస్తోంది చేతిగీతల దారాలతో కట్టగలవా? గుప్పిట బిగించి పట్టుకో.. పచ్చికలలా కనురెప్పల్లో ఒదిగిపోతుంది...
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OXonxk
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OXonxk
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి