kb || ఆఫ్స్కారింగ్స్|| రాజుల చెరను దాటిన దాన్ని పత్రికా పొరల్లో ఇరకపెట్టి, పాత్రికేయుల పాదాల క్రింద బలిపెడుతూ కవిత్వాన్ని, క్రియాశీలవాదుల కరస్వేదాన్నే కవిత్వం చేస్తూ, పత్రికా అచ్చులనే మెయినస్ట్రీమ్ గా పూజిస్తూ, సోకాల్డ్ కవుల సమూహాల మధ్య, విర్రవీకుంటూ, చిందులేస్తూ చుప్పనాతి వాక్యాలతో, మరింత వీకు కవిత్వాలకు దారులేసుకుంటూ, ఏ పరీక్షకు నిలువక, దేనికీ వెరవక పేర్ల పైన పేర్చుకుంటూ పిచ్చి పదాలను,. కలుపుకుంటూ చేతులను, కౌగిలింతలతోనే, కరచాలన ధ్యనులతోనే, కార్చుకుంటూ జ్ఞానపు చొంగను, కవులుగా చెలామణయ్యే చెల్లని కాసులు కనెక్టివిటి పాపులారిటీ నెత్తికెక్కిన పోతులు, భయంకర భజనవాద కవితత్వాల ఉద్యమకారులు, కాకా కొట్టుల్ల మీద కవులైన కాకులు, పనికి రాని పాత కాపులు పాడే కొత్త పాట, అంతర్జాల కవిత్వం పసలేనిదని, ద్వితీయ శ్రేణిదని. ఇక్కడ నిలబడలేక, కాస్తంత కూడా వెలగలేక. ( పట్వర్ధన్ గారి ఓ పోస్ట్ కి స్పందనగా ...) 5/3/2014
by Bhaskar Kondreddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NSF8IZ
Posted by Katta
by Bhaskar Kondreddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NSF8IZ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి