తెలంగాణా గడీలు ......ఒక గత చరిత్ర రికార్డ్ తొవ్వ .................5.3.2014 ...............అన్నవరం దేవేందర్ తెలంగాణా లో గడీలు ఒక మహత్తర చరిత్ర .గడీలు అంటే దొరలు భూస్వాముల ఫ్యూడల్ పటాటోపం . అయితే ఇవి గతం ముచ్చట .ఇప్పుడన్నీ కూలిపోతున్న సందర్బం .తెలంగాణా కు మహత్తర పోరాట చరిత్ర ,వారసత్వం పుష్కలంగా ఉన్నాయి .అన్ని ప్రాంతాలకూ ఉంటాయి .చరిత్ర నిర్మాణం అవుడే అంతట ఉండది .అగొ సందర్భం లోనే ప్రముఖ కథా రచయిత .కే .వి .నరేందర్ ,ప్రముఖ కవి జర్నలిస్ట్ సంగవేని రవీంద్ర లు తెలంగాణా గ్రామాలు కాళ్ళు బలుపం కట్టుకొని తిరిగి చరిత్ర రికార్డ్ చేసిండ్రు .అది పుస్తకం గా వచ్చింది .దాని పేరు 'తెలంగాణ గడీలు '.ఇందులో ముప్పై గడీల చరిత్ర ఉన్నది .సిర్నాపల్లి గడి,బండలింగాపూర్ గడి ,దోమకొండ గడి ,సంజీవన్ రావ్ గడి ,తపాల్పూర్ గడి ,గట్ల మల్యాల గడి ,విసునూర్ గడి ,సిరికొండ గడి ,ఇందారం గడి ,గద్వాల గడి ,రాజారామ్ -భీమారం గడి ,కల్లెడ గడి ,బొల్లారం గడి ,లింగన్నపేట గడి ,మదనపల్లి గడి ,చల్గల్ గడి ,రాజాపేట గడి ,మద్దునూర్ గడి ,దాచారం గడి ,కొడిమ్యాల గడి ,రామాజీ పేట గడి ,నడిగూడెం గడి ,ఇటిక్యాల గడి ,దుబ్బాక గడి ,వంగర గడి ,వనపర్తి గడి కోహెడ గడి ,హుస్నాబాద్ -అక్కేన్నపేట గడి ,పెద్ద శంకరం పేట గడి ,మదనపల్లి గడీల వివరాలు ఫోటోలతో పాటు ఉన్నాయి ఎనుకట గడీల లో పెత్తందారి తనం రాజ్యం ఏలింది .ఎనబయో దశకం లో జరిగిన నక్సలైట్ ఉద్యమాల వల్ల గడీలు ఖాళీ అయినాయి .కాని ఆ చరిత్ర నిలిచే ఉన్నది . గడీల నిర్మాణం బహు గొప్పది అద్భుతమైన కట్టడాలు అవి .ఆనాటి ప్రజలు వెట్టి చసి నిర్మించిండ్రు .అందులో శర్మ జీవుల చెమట కలే గలిసి ఉన్నది .ఏది ఏమైనా ఇవి ఒకానొక చరిత్రకు నిదర్శనం . చరిత్ర పరిశోధన రచన చేసిన నరేందర్ రవీంద్రలు అభినందనీయులు ,చాల శ్రమకోర్చి తిరిగి తిరిగి సమాచారం సేకరించిండ్రు .....
by Annavaram Devender
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NSt7mM
Posted by Katta
by Annavaram Devender
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NSt7mM
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి