పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మార్చి 2014, బుధవారం

Aruna Naradabhatla కవిత

చినుకులు __________అరుణ నారదభట్ల అంతగా పరిగెత్తే మబ్బులను చూస్తుంటే ఎందుకో అనుకున్నా...! వెలుగును ముంచేస్తూ చిమ్మచీకట్లను మోసుకొస్తూ ఒక్కో మేఘాన్ని రాజేస్తూ చినుకుల్లా దులిపేస్తుంటే అనుకున్న చల్లగా నన్ను చేరేందుకేనేమో అని ఇంతటి పట్టణంలో వాటికి సేదతీరడానికి చోటెక్కడుందీ! అన్ని దారులూ నిండుకున్న భవంతుల సందుల్లోంచి వరదై రోడ్డునపడి వచ్చిపోయే వాహనాలను అక్కడే ఆపి కాళ్ళచుట్టూ పెనవేసుకొని తమను వెళ్ళనీయమంటూ వేడుకుంటున్నాయి...కన్నీళ్ళై! ఇలాంటి నగరాల్లో వర్షపు నీటికి చోటెక్కడుందీ... మనిషికి మనిషీ రాచుకుంటూ తిరిగే ఈనేలే దొరికిందా విశాలప్రపంచాన్ని వీడి ఇక్కడే పడిందీ వాన! అవసరానికి పనికిరాని స్నేహితురాలిలా ఈ వేసవి ప్రారంభాన వాన మొలకెత్తిన పంటలనూ ...మామిడి పూతనూ శిశిరాన్ని పంపించి వసంతాన్ని మోసుకొస్తూ కొత్తగా మళ్ళీ గొంతును సవరించే కోకిలలను బాధపెడుతూ భయంలో ముంచేస్తుంది! పంటనష్టం ఎలాగూ జరిగింది మరి అవసరమున్నప్పుడు మళ్ళీ తొంగిచూస్తుందో లేదో ఈవాన... ఈ మట్టిలేని నగరాల్లో కాకుండా మనసున్న పల్లె జీవనంలోకి కురిసిందో పచ్చదనపు శాలువలతో అక్కున చేర్చుకొని సన్మానిస్తారు...! అక్కడైనా తన ఉనికి కాపాడుకుంటే సరి అవసరానికి అందివచ్చిన ఆప్తుడిలా! 5-3-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1opgmvl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి