పూర్ణిమా సిరి || నువ్వు|| ఏదో ఒక మలుపులో మన కలయిక తప్పదు,నువ్వు కలుస్తావనే స్పృహతో జీవించడం నాకు సాధ్యం కాదు,చేరలేని తీర దూరాల కోసం వేచే నేను కలవక తప్పని నిన్నెందుకో మోహించలేను,అలా అని ద్వేషించనూ లేను.. నిశ్శబ్దనీరవంలోకి జారిన ప్రతీసారి నాకు నీ స్పురణ వస్తుంది,నువ్వు హత్తుకుంటే బాగుండు అని చిత్రమైన చిత్రాలను చిత్తం సృజిస్తుంది, నీకంటే నాకు ఆప్తులెవరున్నారు! నీకున్నంత మోహం నాపై ఎవరికుంది గనుక? నీలో నేను కరిగాక ఈ లోకం లోని బంధాలన్నీ అబద్దాలనిపిస్తాయి. నిజాన్ని జీర్ణించుకోవడం మొదలు పెడతాను కానీ ప్రయాసంతా కొన్ని ఘడియల్లోనే ముగిసిపోతుంది మళ్ళీ ఆట మొదలు, నాతో ఊహలో,నేను ఊహలతోనో ... మరిన్ని బొమ్మలు,కొత్త ఆట నీవు నన్ను గెలిపించేంత వరకు.. అన్నీ నన్ను నవ్విస్తూ,కవ్విస్తూ,అన్నీనిజాలేనని భ్రమింపజేస్తూ ,కొత్త ప్రయాణాలకు ప్రారంభ గీతికలు ఆలాపిస్తూ, జీవధారను ప్రసరింపజేస్తూ,నీకు దూరంగా పరుగెత్తుతూ వెనకటి వాసనలు వదలని కొత్త నేను కానీ నువ్వెప్పుడూ అలానే! ఏ మార్పూ లేకుండా,కరుణా భరిత నయనాలతో, ప్రేమగా హత్తుకోవడానికి సిద్దంగా!! నాకెన్నెన్నో పేర్లు,మరెన్నో రూపాలు...నువ్వేమో ఎప్పటికీ ఒకే పేరుతో... అన్నింటినీ నీలో దాచుకునేంత అనాదితత్వంతో ,అనురాగంతో నీటి బింధువులా నేను.. సముద్రం,సూర్యతాపాల సంతులిత శక్తిలా నువ్వు అప్పుడే నిన్ను మృత్యు కన్యకవనుకుంటా పునర్జన్మ నిచ్చే ఏకాంతమై ఎదురవుతావు లోలోని నీశీధి రాగమా! ఏకాంతమా! అంతులేని ప్రేమ నీది అర్థాలు వెతుక్కునే ఆరాటం నాది 5.3.14
by Poornima Siri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dq3jbv
Posted by Katta
by Poornima Siri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dq3jbv
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి