జీవితం వ్యాపారమైంది బతుకు ఒప్పందాలమయమైంది సేకరించిన గేదె పాలను మనిషి భరించలేని మంచులో పాలను పొడిగా మార్చి రంగుల డబ్బాలో నింపి అమ్మ పాల కన్నా మంచివంటూ ఊదరగొట్టే ప్రచారం అన్నం పప్పు అందులో నెయ్యి మెత్తగా చేసి అమ్మ పెట్టె ముద్ధలకన్నా సెరిలాక్ ను పోషించమంటున్నారు చారడేసి కళ్ళు వంకీల కురులు తేనెలూరే పెదాలు బరువైన పాలిండ్లు సొగసు చూడతరమా అనిపించే నా చెలి సౌందర్యానికి నల్లరంగుందని తెల్లతోలు కోసం ఫెయిర్ అండ్ లౌవ్లీ పూయమంది జాత్యహంకార వాణిజ్యం నిరంతరం నా మదిలో నిలిచినా నెచ్చెలికి ఎవరో రాసిన భావుకత కింద నా సొంత సంతకం చేసి ప్రేమను చెప్పమంది ఆర్చిస్ కార్డ్ లోకానికి బువ్వ పెట్టె సాగును కూడా వదల్లేదు కదా ఈ పాడు వ్యాపారం ఎద్దు పేడ ను ఎరువుగా చేసి దుక్కి దున్నిన నా రైతు గుండెను గోదావరి డి.ఏ.పి పొల్లు చేసింది పండిన పంటలో వచ్చే ఏడు కోసం దాచుకొనే విత్తులే లేకుండా పోయింది బి.టి విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతు పై పోలీసు కాల్పులైంది వ్యాపారం కన్న బిడ్డలను అందలం ఎక్కించాలనే కోర్కె కాన్వెంట్ చదువుల ఫీజుల బరువైంది ఇంటి ముందు చలువ పందిళ్ళు పోయి బిడ్డల పెళ్లి ఫంక్షన్ హాల్ వ్యాపారమైంది కొడుకు పెళ్లై ఏడాది తిరక్కముందే మనవడిని ఎత్తుకోవాలన్న తాత ఆశ ప్రైవేటు దవాఖానాలో కడుపు కోతలైనాయి నాకిప్పుడు నా చిన్నతనం గుర్తుకొస్తుంది పొలం పనికెళ్ళి అలిసి వచ్చిన మా అమ్మ మూడేళ్ళు వచ్చిన నా చిన్న చెల్లికి చనుబాలివ్వటం నాకింకా గుర్తు ఉంది బిడ్డలు బలంగా ఉండాలని అమ్మ పెట్టిన వెన్న ముద్దా ముద్ద పప్పు నేనింకా మర్చిపోలేదు చీకటి పడితే పిల్లలకు దోమలు కుట్టొద్దని ఒదేనిలో, హిట్టో, గుడ్ నైటో అప్పుడెక్కడివి పొడుగు చేతుల నాన్న పాత చొక్కా వేసుకుంటి మంచం చుట్టూ అమ్మ దోమ తెర కట్టేది అప్పుడు ఉన్నదంతా అనుభంధం ఆప్యాతే కదా డంకేల్ ముచ్చట్లు ప్రపంచ బ్యాంక్ ఒప్పందాలేం లేవు అవే కదా మన బతుకులు ఇలా వ్యాపారం చేసింది
by Venugopal Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e2PWK2
Posted by Katta
by Venugopal Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e2PWK2
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి