చదివిన కవిత్వ సంపుటి :- 18 (కవి సంగమం) "గుర్తు కొచ్చిన గత స్మృతుల కవిత్వ చిత్రం ఒక సంచలిత రాగం" కవిత్వసంపుటి పేరు :- "ఒక సంచలిత రాగం" సంపుటి రాసిన కవి పేరు :-"సాహిత్య ప్రకాశ్" పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి "ఒక ఆత్మసాక్షాత్కార దృశ్యం కోసం' "ఆకు పచ్చని ఙ్ఞాపకం" కోసం "ఒక సంచలిత రాగం" కోసం ఒక "జీవన పరిమళం"కోసం "అక్షర తపస్వి"అయి "ఒక తడి గీతం"రాయాడానికీ"తల్లీ నిన్ను తలంచి"అని ప్రార్థిస్తూ "అంతర్వేదన" పొందుతూ" జలజ్వాల"ను "ఆపాదమస్తకం"ఆవాహన చేసుకొంటూ "ఐక్యరాగం" కోసం "వెలుగుస్తంభం"మీద నిలిచి "నెత్తుటి గాయాలు"కావు కావాల్సింది అని "సలామ్" చెబుతూ కలం పట్టిన కవే సాహిత్య ప్రకాశ్. ప్రాచీన స్మృతులూచే చప్పుళ్ళను రికార్డ్ చేశాడు కవి సాహిత్యప్రకాష్ ఈ సంపుటిలో. "మిత్రమా! నా చుట్టూ వేన వేల స్నేహ పూలు పలకరిస్తూ పరిమళిస్తున్నా నీ స్నిగ్ధ సౌరభానికి సరితూగలేవు నీ ఙ్ఞాపకాల చిత్తడిలో ఏకాకి గుండె చప్పుడులో మౌన సముద్రమై"-పోతున్నాని చివరి చూపైన దక్కనివ్వకుండా అల్లా పిలుపు అందుకొని హడావిడిగా వెళ్ళిపోయిన మిత్రుని కోసం తన దుఃఖాన్ని కవిత్వంగా మార్చినవాడు సాహిత్య ప్రకాష్. "విషాదకరమైన విషయం ఏంటంటే భగవంతుడు నా బాల్య పుస్తకం లోని చివరి పేజీని చించేశాడు నేను తొందరగా పెద్ద వాడినై పోయాను"-అంటూ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకొని దాన్ని పద్యంగా చేసిన వాడు సాహిత్య ప్రకాష్. 'అమ్మా నువ్విప్పుడు లేక పోయినా నీ చీరల్తో నీ చేతుల్తో నువ్వే స్వయంగా కుట్టిన బొంత!నీ రూపంలో ఓ ఆకుపచ్చని ఙ్ఞాపకమయింది అనుభూతుల పాలపుంతయ్యింది -అంటూ అమ్మ తీయని ఙ్ఞాపకాలను కవిత్వంగా నిర్మించినవాడు సాహిత్య ప్రకాష్ "ఒక సంచలిత రాగం"-అనే ఈ సంపుటిలో కవి సాహిత్యప్రకాష్ స్వీకరించిన కాన్వాస్ చాల విస్తృతంగా కనిపిస్తుంది.ఇందులో వున్న వస్తువైవిధ్యం కవికి గల భిన్న వస్తుస్వీకరణ కాంక్షను,ఆ వస్తువును కవిత్వం చేయడంలో గల ఇచ్ఛను చెప్పకనే చెబుతుంది.స్నేహితుని ఙ్ఞాపకాల చిత్తడిలో చెమ్మగిల్లినతనాన్ని,అమ్మ,నాన్నల ఆకుపచ్చతలపుల ఆనవాళ్ల సుడిలో తిరుగుతున్న వైనాన్ని,బాల్యం తనకు అందించిన తీపితీపి గుర్తులను వస్తువులుగా తీసుకొని మనసు కదిలించే కవిత్వం చేశారు.అంతేకాదు ప్రపంచీకరణ ప్రఛండ మారుతానికీ కొట్టుకపోతున్న క్షురక,రజక కులవృత్తుల శైథిల్యాన్ని,మాటిమాటికీ మోసపోతున్న మగువల జీవితాన్ని,నెత్తుటి గాయాలతో మరిగిపోతూ మానాన్ని అమ్ముకొనే వృత్తిలో వున్న మైనపు బొమ్మల బ్రతుకుల్ని ,మద్యపానం,మాదక ద్రవ్యాల సేవనం మున్నగు వ్యసనాల వలలో ఇరుక్కుపోతున్న యువత బాధ్యతారహిత్యాన్ని వేదనా తడితో కవిత్వపు దృశ్యం చేశాడు.ఇంతే కాదు ప్రియురాలి ప్రేమకు సుప్రభాతం పాడే క్షణాన్ని,పల్లే పరిమళాన్ని,చింత చెట్టు ఆప్యాయతను,తెల్లారింది మొదలు ఊరిఊరికి ప్రయణికుల్ని చేరవేసే బస్ ని,ఆ బస్ ని నడిపే డ్రైవర్ ని ,అపరాధిని చేయకండి అని ప్రార్థించే వైరస్ క్రిమిని సైతం ఈ కవి తన కవిత్వపు నగలో పొదుగుతాడు. జన్మించిన వారు మరణించక తప్పదు.అయితే వారు అర్థాంతరంగా ఎవరికైనా దుఃఖం వస్తుంది.అర్థాంతరంగా మరణించిన వారు మనకు కావలసినవారయితే మరింత దుఃఖం కలుగుతుంది.అట్లా మరణించినవారు మన అభివృద్ధిని కోరుకుండే వాళ్ళు అవసరమైనప్పుడు అన్నీ తామై ఆదుకుండేవాళ్ళు అయితే అశ్రువులు రెప్పల గూర్ఖాలను తప్పించుకొని చరాచరా చెక్కిల్ల మీదికొస్తాయి.అపరిమిత వేదనను కల్గిస్తాయి."ఓ జబ్ యాద్ ఆయే"-అనే కవితలో కవి తన బంగారు భవిష్యత్తు కోసం అందమైన కలల్ని కలవరించే మిత్రుడు ఇస్మాయిల్ అర్థాంతరంగా మరణిస్తే తనకు కల్గిన దుఃఖాన్నికవి కవిత్వం చేశాడు.తన ఆత్మ దీపం ఇలా వెలుగుతుందంటే కారణం అతని ఙ్ఞాపకాలతో కట్టుకొన్న పాలరాతి ప్రహారి చలువేనని కవి చెప్పిన విధం మనల్ని కవి పొందిన దుఃఖపు దారిలోనే నడిపిస్తుంది. "ఇలా అయిపోయింది"-అనే కవితలో "నా జీవితపు డైరీలో దాచుకున్న /నెమలీక లాంటి బాల్యం గురించి/అది అందించిన అనేకానేక స్మృతుల గురించి ఏమని చెప్పను"అని అంటూ గత ఙ్ఞాపకాలను నెమరువేసుకొంటూ,దేవుడు బాల్యపుస్తకంలోని చివరి పేజిలను చింపేయడంవల్లా బాల్యం కోల్పోయానని కవి విచారం వ్యక్తం చేస్తాడు."కవిత్వమొక తీరని దాహం"-అన్నాడు మహాకవి శ్రీ.శ్రీ.ఈ కవి కూడా ఎన్ని నీళ్ళు తాగిన/ఇంకా దాహం వేస్తునే వుంటుంది/ఎన్ని కవితలు రాశినా/ఇంకా ఇంకా రాయాలనిపిస్తునే వుంటుంది"-అంటూ కవిత్వంపట్ల తన ఎడతెగని దాహాన్ని స్ఫురింపచేస్తూ కవైనా వాడు ఈ అనుభూతిని పొందుతాడంటాడు. ప్రపంచీకరణ భూతం క్షురకవృత్తిలో తనజీవితాన్ని అనందంగా గడుపుతున్న వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టిపడేసీ కాంక్రీటు సముద్రంలో కార్మికున్ని చేసిన విషాదాన్ని గొప్ప శిల్పంతో ఆవిష్కరించాడు. ఈ కవిత్వ నిర్మాణంలో క్షురకవృత్తిని చేసే వ్యక్తి వృత్తినైపుణ్యాన్ని,అతని రూపాన్ని మనసులో ముద్రించుకుండేటట్లు"మగ సిరికి ప్రతీకలా మొనదేలిన మీసకట్టును మణికట్టు మంత్రంతో తను కత్తిరిస్తే ఊరినిండా ఎన్.టి.అర్,ఏ.ఎన్.ఆర్ లు ప్రత్యక్షమయ్యేవాళ్ళు.-అని రూపు కట్టించాడు.తాళి కట్టించుకునే వధువు తలవంచి కూర్చున్నట్టు అందరు అతడి ముందు మోకరిల్లాల్సిందేనని కవి కులవృత్తి విశిష్టతను ఈ "శిథిలమైనపొది"-అనే కవిత ద్వార తెలియచేస్తాడు.మనిషి వేసుకున్న బట్టల మురికిని వొదల కొట్టె రజక వృత్తిని చేసే వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు 'బండని నమ్ముకొని బతుకులు వెళ్లదీస్తున్న జీవితాల్లో వెట్టిచాకి రేవులే తప్ప వెతలు తీరే దారి'-లేదా అని కవి సమాజాన్ని నిలదీస్తాడు.వారి పట్ల సమాజదృష్టి మారకుంటే సమాజం గజ్జి కుక్కలా మారుతుందని కవి తన అలోచనా దృక్పథాన్ని చక్కని అభివ్యక్తితో వ్యక్తపరిచాడు. సాహిత్య ప్రకాష్ మంచి కథారచయిత.ఇటీవల అవార్డ్ కూడా ఆయన కథలకొచ్చింది.కథకుడు కావడం వల్లనేమో కొన్ని కవితల్లో కథాకథన శిల్పం తొంగి చూస్తుంది."రవి కిరణం పుడమిని తాకక ముందే పల్లె విడిచి మాసిన బట్టల మూట ఆమె నెత్తి మీద మొలుస్తుంది"-అని ఆరంభమయ్యే రజక కులవృత్తి గొప్పదనాన్ని చెప్పె "ఒక చాకి రేవు పాట"-కవికున్న కథాకథన చాతుర్యాన్ని కూడా అవగతం చేస్తుంది. ఈ కవికి నాన్నంటే వొక వెలుగు స్తంభం-.అమ్మంటే వొక ఆకు పచ్చని ఙ్ఞాపకం-.వొక మాతృహరితం.-"తల్లి నిన్నుదలంచి"అనే వొక ప్ర్రార్థన.ఒక ఆత్మ సాక్షత్కారదృశ్యం.-తల్లీదండ్రుల గురించి ఈ కవి ఆరు కవితలకు పైగా వొకే సంపుటిలో రాసి తనకు వారిపట్ల గల ప్రేమను చాటుకొన్నాడు.” "పేదరికపు పెంకుటింట్లో/గుడ్డి దీపంకింద పాఠం చదువుతూవుంటే తనొచ్చి వెలుగు స్తంభమయ్యేవాడు"-అంటూ ఈకవి తండ్రిని ఎంతో గొప్పగా కవిత్వం చేసి ఋణం తీర్చుకున్నాడేమో నని నాకనిపించింది."నా కోసం కొండంత చేసిన నాన్న గారి ఋణం కొంతలో కొంతయిన తీర్చుకుందామంటే ..దేవుడు నన్ను ఋణగ్రస్తున్ని చేసి నాన్నగారిని ఆయన దగ్గరకు తీసుకెళ్ళాడు"-అని అంటూ ప్రకాష్ తండ్రి పట్ల బాధ్యత లేని వారికి గుర్తు చేస్తాడు వారి బాధ్యత గురించి. అమ్మ గురంచి రాసిన "ఆకుపచ్చని ఙ్ఞాపకం" అనే ఖండిక కథనాత్మక శిల్పానికీ మంచి ఉదాహరణ.అమ్మ లేకపోయినా ఆమె తన చీరల్తో కుట్టిన బొంత తనకు అనుభూతుల పాలపుంతయ్యిందని ప్రకాష్ అంటాడు."ఆమెను దుఃఖ నదిని చేయకండి/బతికుండాగానే బతుకమ్మ లాంటి అమ్మ మనస్సును తూటాల్లాంటి మాటలతో తూట్లు పొడవకండి-అని మాతృహరితం కోల్పోయిన మాన వృక్షాలకు గుర్తు చేస్తాడు ఈ కవితలో.ఈ కవితలు ఇట్లాంటి అంశంపై రాసిన రావులపల్లి సునీత,నిర్మల కొండేపూడి గార్ల కవిత్వాలను గుర్తుకు తెస్తాయి. ఈ కవికీ ఏ వస్తువును తీసుకొన్న దానికి కవితా పరిమళం అద్ది రాయటమ్ బాగా తెలుసునేమో?అందుకే "పేదరికం అంటే/ఆకలి కేకల వ్యథాతప్త దృశ్యం కాదు/అతుకుల బతుకుల వైచిత్రి కాదు/పేదరికం ఒక దీప ఖడ్గం/ఆప్యాయత స్వర్గం/మమతల దుర్గం'-అంటూ పేదరికం దుఃఖ కారణం కానే కాదు వొక కొత్త వూహను నిర్మించాడు.ఈ సమ్పుటిలోని 'పరిహాస రేఖ'అనే కవిత ఆసాంతం కవిత్వాన్నే కుమ్మరిస్తుంది."మనసు తునాతునకలైన చోట అశ్రునది శబ్దంలో ప్రవహిస్తునేవుంటుంది"ఇలా ప్రతి పంక్తిలో కవిత్వ గంధం విరజిమ్మబడింది.పురా స్మృతుల స్మరణ అనే వొక లక్షణం వొక సాంప్రదాయంగా మారి అనేక కవులు ఆమార్గంలో నడిచేటట్లు చేసింది.ఇందుకు ప్రకాష్ మినహాయింపు కాదు.ఆయన కూడా ఎక్కువగా గడచిపోయిన లేదా గతించిన పురా స్మృతులను తెచ్చుకొంటూ మంచి కవిత్వం రాశారు. 'ఆ" చింత"నలో నా స్వాంతన"-అనే కవిత ఇందుకు ఒక నిదర్శనం."మా ఊరిలోకి అడుగు పెట్టగానే నెంబయ్య చింత మాను కళ్లప్పగించి చూస్తుంది"అని మొదలయ్యే ఈ కవితలో ఆ చింత గురించిన గతించిన ఙ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ..తన నాన్న తలపుల్ని కూడా చేస్తాడు."దాన్ని చూస్తే మా నాన్న లక్ష్మణదాసు కర్రపట్టుకొని పాఠం చెప్పినట్లుంది"అనిగుర్తుకు తెచ్చుకొంటాడు.ఈ కవి చాల కవితల్లో ప్రాచీన స్మృతులూచే చప్పుడు లను వినిపిస్తాడు. యువతలోని వ్యసనాలను నిరశిస్తూ"కొన్ని ఆక్రందనలు..ఒకనినాదం"అనే కవితను,పచ్చ్డి మెతుకుల్ని పరమాన్నంగా తలంచే పేదవాల్ల జీవితాల్నీ "శిథిలచిత్రం"అనే కవితలో వేశ్యావృత్తినిని జీవనాధారంగా చేసుకున్న వాళ్ళ గురించి" నెత్తుటి గాయాలు"అనే కవితలో ,"వాడెవడో వస్తాడు/నా మీదకు రాళ్ళు విసురుతాడు/వీడెవడో వొస్తాడు/ఎగిరెగిరి ఎద మీద తంతాడు"-అంటూ ఆర్.టి.సి. బస్ అంతర్వేదననుఈకవిచిత్రించాడు.పిట్ట,గుట్ట,ఇసుక,సముద్రం లాంటివాటిని కూడా కవిత్వం చేసి పర్యావరణ స్పృహ పెంచే సందేశాలు ఇచ్చాడు. ఇంత మంచి కవిత్వాన్ని అందించిన సాహిత్య ప్రకాష్ ని మెచ్చి పరిచయం చేయటంతో నా బాడ్యత ముగిసిపోలేదు.చెప్పాల్సినా కొన్ని మాటలు చెప్పకపోతే ఆయన అభివృద్ధిని నిరోధించిన వాన్నీ కాదలుచుకోలేదు కాబట్టి కొన్ని మాటలు నొప్పిని కలిగించేవయిన చెప్పక తప్పదు.తొలి దశలో ఎమ్త చేయి తిరిగిన కవైన తన పూర్వ కవులనో,తన కాలపు కవులనో అనుసరించక తప్పదు.అయితే కాల క్రమేణా తనదైన సొంత గొంతుక ఏర్పరుచుకుంటాడు.అలా ఏర్పరుచుకోగలిగే కవే కాలంతో కలసి నడుస్తాడు నిలుస్తాడు.తిలక్,ఆశారాజు ప్రభావాలనుంచి ఈ కవి బయటపడి తనదైన సొంత గొంతుకను ఏర్పపరుచుకొని మరికొన్ని మంచి సంపుటాలు తేవాలని ఆశిస్తాను.కవిత్వం నిర్మించేటప్పుడు పద ప్రయోగ ఔచిత్యం కూడా కవిత్వాన్ని మరింత పదునెక్కిస్తుంది.పద ప్రయోగ ఔచిత్యం కూడా వొక శిల్ప రహస్యమే."ఇలా అయి పోయింది"అనే కవితలో "నా జీవిత డైరీలో దాచుకొన్న నెమలీక"-అనే ప్రయోగం చేశాడు కవి.అయితే నెమలీకను దాచుకొనేది ఆ వయసులో డరీలో కాదు.నెమలీకను బాల్యంలో దాచుకొనేది అచ్చు వాచకంలో లేద నోటె బుక్ లో.కవి అలా ప్రయోగించటం తప్పేమి కాకపోవచ్చు.కాని ఔచిత్యవంతంగా కవిత్వం వుంటే కవి మరింత పాఠకుల హృదిలో నిలిచిపోతాడు. "నా జీవిత పతాకాన్ని ఎగరేసిన జెండా కర్రా"-అనే కవిత నన్ను బాల్యం లోకి తీసుకెళ్ళి "సైకిల్ చక్రానికీ తాడుతో గట్టిగా లాగి బిగించి కట్టిన డబ్బా" చేసే ధ్వని లో పుల్లైస్ అమ్మే దృశ్యం కళ్ల ముందు ఘనీభవించి నిప్పుల కుంపటై మండే ఎండాకాలం లో పుల్ల ఐస్ తింటున్న అనుభూతిని మిగిల్చింది.రైతుని గురించి కూడా ఈకవి మంచి కవితలు రాశాడు. "కవిత్వం నా శ్వాస క్రియ ఆకుపచ్చని ఙ్ఞాపకాల కిరణజన్య సంయోగక్రియ కవిత్వమంటే నా హృదయంలోంచి అక్షారాలుగా ప్రవహించే ప్రేమ వాహిని మధుర భావాల అమృతమయి ఊటబావి"-అని అనుకొంటున్న సాహిత్య ప్రకాష్ కి అభినందనలు అందిస్తూ కవి సంగమ కవులకు ఈ పరిచయం చదివి నాకు, కవికీ సూచనలు తెలియచేస్తారని ఆశిస్తూ వచ్చే మంగళవారం మరో కవిత్వ సంపుటితో కల
by Rajaram Thumucharla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1faUeUi
Posted by Katta
by Rajaram Thumucharla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1faUeUi
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి