శ్రీ మోదుగు // సంపూర్తి చిత్రం ... // ఒక సంఘర్షణ ఇతిమిద్ధంగా తేలని ఫలితాలు చేసేది ఒకటే ప్రయాణం కలవని మార్గాలలో వెనుతిరిగి చూడాలన్న తాపత్రయం అణుచుకుంటూ ఎవరినుంచో తొంగి చూస్తూ అనుకుంటారిలా కాలం కలిసి వస్తే తిరిగిరామా అని కాని తెలియని దల్లా వాళ్ళకి కాలం కలిసిరావడం ,తీరాలు చేరువవ్వడం దూరం నుంచి చూసే భూమ్యాకాశలల్లే ఊరించడమేనని.... కలఇకలో ఉన్న అందాన్ని ఆనందాన్ని ఒక్క ఆలోచనలో మోహించి అనుభవించి అనుకుంటారిలా ఎవరికీ అంతుచిక్కని అపురూపసంగమమని ,ఒక అవ్యక్తమని కానీ తెలియనిదల్లా వాళ్ళకి అవ్యక్తాలు ఎప్పటికీ వ్యక్తం కాలేవని అభ్యంగనం ఎప్పటికీ అంక్షా పూరితమే అని... ఒకరినొకరు గుప్తంగా వింటూ అనుకుంటారిలా ఎవరిని ఎవరూ చదవలేరని కాని తెలియని దల్లా వాళ్ళకి వారిద్దరూ ఒక స్వేచ్చాయుత సంపూర్తి చిత్రమని … Date: 17/02/2014
by Sri Modugu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nIOMsR
Posted by Katta
by Sri Modugu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nIOMsR
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి