తెలుగు వాడు తెలుగంటే కాదు రెండున్నర జిల్లాల యాస తెలుగంటే కాదు రెండు కులాల వారి ఆధిపత్యం తెలుగంటే .. పదిహేను కోట్ల నాలుకలు తెలుగంటే ముప్పై ఆరు రకాల యాసలు తెలుగంటే యాభై రెండు మాండలికాలు తెలుగంటే కోటి సూర్యుల వెలుగు. తెలుగు వాడంటే ! తరతరాలుగా నలిగిపోయిన వాడు యుగయుగాలుగా అణచ బడ్డ వాడు తెలుగు వాడంటే స్వతంత్ర దేశంలో భావ స్వేచ్ఛ లేని వాడు స్వరాష్ట్రం లో పరాయి వాడు తెలుగు వాడంటే వెలుతురు ఎరుగని చీకటిలో వేకువకై ఎదురు చూసేవాడు తెలుగు వాడంటే తనపై తాను యుద్ధం చేస్తూ పక్క వాడిపై గెలువాలనుకునే వాడు తెలుగు వాడంటే శాశ్వత అభివృద్ధి ప్రణాళిక వదిలి తాత్కాలిక ప్రయోజనాలకై తపన పడే వాడు తెలుగు వాడంటే ఆత్మహత్య చేసుకునే మానసిక దౌర్భల్యాన్ని అమర వీరత్వం గా భావించే వాడు తెలుగు వాడంటే అన్ని ఊళ్లనీ ఎండబెట్టి ఓకే నగరాన్ని అభివృద్ది చేసుకునే వాడు తెలుగు వాడంటే ఆలోచనతో నిర్ణయించుకోలేక ఆవేశంతో అలజడి రేపే వాడు తెలుగు వాడంటే దొంగల చేతికి తాళమిచ్చి ఉద్యమ ఫలాన్ని దోపిడీదారులకిచ్చే వాడు తెలుగు వాడంటే క్రైస్తవానికి మారినా కుల గజ్జి వదిలించుకోని వాడు. - -గుణ చందు సారంగం (సింగపూర్)
by Telugu Chandrudu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kQcXIM
Posted by Katta
by Telugu Chandrudu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kQcXIM
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి