జాస్తి రామకృష్ణ చౌదరి త్రిశంకుస్వర్గం ఒక నిరంతర జీవనస్రవంతిలో ఒక హృదయప్రజ్వలిత క్రాంతిలో ఎన్నో సుందరమైన స్వప్నాలతో ఎన్నో పరిశ్రమిత శ్రామిక శ్రమ బిందువులతో ఎన్నో కన్నీటి ఆనందసింధువులతో భవిష్యత్విస్కృత కాంతిలో నిర్మితమైన ఆకాశమది విభిన్నహృదయమాత్రికలు ఒకటితో ఒకటి మమేకమై ఒకే దృక్కోణంగా ఏర్పడి ఎన్నో యుగాల క్రితం ఈ జాతి కోసం ఒక భూతల స్వర్గంగా ఆవిష్కరింపబడిన బృందావనమది కానీ ఇప్పుడు ఆ ఆకాశం కుప్ప కూలిపోతోంది కాలాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న చేతులు చేస్తున్న ఈ అక్రమయుద్దంలో ఇప్పుడు జీవితాలు కూలిపోతున్నాయ్ వర్తమానపు నేత్రాలు ఆవిశ్రాంతంగా వర్షిస్తున్నాయ్ గుండె ఎడారిగా మారిపోతోంది ఎడారిగా మారబోయే ప్రకృతిని తలుచుకుంటూ పుడమితల్లి ఆత్మ అంతులేని ఆవేదనతో అలసిపోతోంది నేలతల్లి ఆక్రందన గానీ ఆకాశపు ప్రతిస్పందన గానీ భావితరాల గోడు గానీ సత్యం యొక్క వాక్కు గానీ ధర్మం యొక్క పిలుపు గానీ వినిపించుకునేది ఎవరు? వారంతా వారికి వారు నిర్మించుకుంటున్న ప్రపంచాల కోసం తమతమ వ్యాజ్యాలతో తమతమ వ్యూహాలతో జీవితం అంచులు దాటి లోయలోకి జారుతున్న వారే! ఆ లోయలోనే తమ ప్రపంచాన్ని సృష్టించుకుని అందులోనే, ఆ చీకటిలోనే ఒక భూతం వరంగా ఇచ్చే ఆ పాతాళంలోనే స్వర్గాన్ని నిర్మించుకొని నివసించాలనుకునే వారే! 18FEB2014
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNO5Bd
Posted by Katta
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNO5Bd
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి