(ఈ మధ్య సూఫీతత్వం కాస్త ఎక్కువగా వంటబట్టింది. ఈ గజల్ చూసి మీరే నిర్ణయించండి.) నన్ను నేను కలుసుకునే రోజుందని నాకు తెలుసు నా లెక్కలు చూసుకునే రోజుందని నాకు తెలుసు చలువరాతి గుండెల్లో నీడలాగ ప్రవహించే నెత్తుటిలో మండుటెండ వేడుందని నాకుతెలుసు పాతబడిన రాత్రిపగలు ఇన్నేళ్ళూ చూస్తున్నా కనురెప్పల ఉదయాలే కొత్తవనీ నాకు తెలుసు సుడిగాలులు ఎన్నెన్నో గుడారాలు వేస్తున్నా కనుపాపలు ఆరిపోని దీపాలని నాకు తెలుసు పగటివెలుగు దుప్పటిలో నిశ్చింతల నిద్రకన్నా చీకటిలో నిర్భీతే గొప్పదనీ నాకు తెలుసు నా నీడకు నా కధలను నేనెన్నో చెబుతున్నా నా తప్పుల జాబితాలు దాగవనీ నాకు తెలుసు చెట్టు నుంచి ఆకు రాలి నేలమీద పడిపోతే భూకంపం తప్పకుండ వస్తుందని నాకు తెలుసు
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gzdxqL
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gzdxqL
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి