పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Telugu Chandrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Telugu Chandrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, మార్చి 2014, శుక్రవారం

Telugu Chandrudu కవిత

ఓటె నీ ఆయుధము వేట మొదలెట్టరా ఓ తెలుగు వాడ నీదె వెలుగు జాడ పడనీయకు తోడేళ్ళ నీడ ఎదురు చూస్తున్నది నీ వాడ వెలిగించర ఓటు కాగడ మోగించర విజయ నగార - గుణ

by Telugu Chandrudu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jBQvDN

Posted by Katta

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Telugu Chandrudu కవిత

తెలుగు వాడు తెలుగంటే కాదు రెండున్నర జిల్లాల యాస తెలుగంటే కాదు రెండు కులాల వారి ఆధిపత్యం తెలుగంటే .. పదిహేను కోట్ల నాలుకలు తెలుగంటే ముప్పై ఆరు రకాల యాసలు తెలుగంటే యాభై రెండు మాండలికాలు తెలుగంటే కోటి సూర్యుల వెలుగు. తెలుగు వాడంటే ! తరతరాలుగా నలిగిపోయిన వాడు యుగయుగాలుగా అణచ బడ్డ వాడు తెలుగు వాడంటే స్వతంత్ర దేశంలో భావ స్వేచ్ఛ లేని వాడు స్వరాష్ట్రం లో పరాయి వాడు తెలుగు వాడంటే వెలుతురు ఎరుగని చీకటిలో వేకువకై ఎదురు చూసేవాడు తెలుగు వాడంటే తనపై తాను యుద్ధం చేస్తూ పక్క వాడిపై గెలువాలనుకునే వాడు తెలుగు వాడంటే శాశ్వత అభివృద్ధి ప్రణాళిక వదిలి తాత్కాలిక ప్రయోజనాలకై తపన పడే వాడు తెలుగు వాడంటే ఆత్మహత్య చేసుకునే మానసిక దౌర్భల్యాన్ని అమర వీరత్వం గా భావించే వాడు తెలుగు వాడంటే అన్ని ఊళ్లనీ ఎండబెట్టి ఓకే నగరాన్ని అభివృద్ది చేసుకునే వాడు తెలుగు వాడంటే ఆలోచనతో నిర్ణయించుకోలేక ఆవేశంతో అలజడి రేపే వాడు తెలుగు వాడంటే దొంగల చేతికి తాళమిచ్చి ఉద్యమ ఫలాన్ని దోపిడీదారులకిచ్చే వాడు తెలుగు వాడంటే క్రైస్తవానికి మారినా కుల గజ్జి వదిలించుకోని వాడు. - -గుణ చందు సారంగం (సింగపూర్)

by Telugu Chandrudu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kQcXIM

Posted by Katta

Telugu Chandrudu కవిత

తెలుగు నాడి దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే రాష్ట్రాలు రెండైనా తెలుగు ఒక్కటే బంధాలు వేరైనా భాష ఒక్కటే మతాలు వేరైనా మనుషులొక్కటే కులాలు వేరైనా కలిమి ఒక్కటే కలసివుంటూ కొట్టుకు చచ్చే కన్న విడిపోయి పరస్పర సహకారంతో బ్రతకడం మిన్న తెలుగు వారందరూ ఒకే రాష్ట్రం లో వుండడం కన్న తెలుగు జాతి మొత్తం ఐకమత్యంగా వుండడం మిన్న ఒకే రాష్ట్రాన్ని రెండుగా విభజించి అధికారాన్ని జిల్లాలవారీగా వికేంద్రీకరించి ఆంధ్ర నగరాలను ఆర్ధిక కేంద్రాలుగా మలిచి కొందరిని మాత్రమే కాక అందరిని అభివృద్ది పరిచి ప్రజలందరూ పట్టు విడుపుల ధోరణితో లాభ నష్టాలను ఇచ్చి పుచ్చుకుని సామరస్యంతో విడిపోయి సమాన అవకాశాలు ఏర్పరచుకొని అసమాన్య ప్రఙ్ఞావంతులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ... -గుణ చందు సారంగం (సింగపూర్) జై తెలంగాణా - జై ఆంధ్ర సీమ

by Telugu Chandrudu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kQcRRm

Posted by Katta