నాక్కొంచెం సహకరించండ
నేను "నది"ని హత్యచేయాలి!
ఎలాగైనా...
ప్రవాహానికి సంకెళ్లువేసి పగను బయటపెట్టుకోవాలి
హృదయానికి అంటుకున్న అగ్గిని కన్నీళ్ళతో ఆర్పుకోవాలి
దాని..
విషపు నవ్వుల కఠిన కంఠాన్ని సమస్త నరనారాలతో ఉరితియ్యాలి
నీ విషణ్ణ వదనాన్ని "మిత్రుడు" చితి పై ఆన్చి భోరుమనాలి
నాక్కొంచెం సహకరించండి
నేను నదిని హత్యచేయాలి !
గుండెలపై ఆడించి, నవ్వించి..
నీళ్ళ అడుగున దాచింది ,
గుండెల్ని ఆపింది..మోసం చేసింది,
దీని కడుపులో ఎన్ని కత్తులు,
ప్రవాహా జగత్తులో ఎన్ని చిక్కులు
ఒక నవ్వుని కన్నీరు చేసిన ఘనత దీనిది,
ఎంత ఘాతుకం ఇది...!!
"పాతికేళ్ళ ప్రాణమిత్రుడి ఊపిరితిత్తుల్లో ఇసుక దాసుకున్న కాసాయిది
ఇన్నాళ్ళ గుండెల తలపాన్పుల్ని మాకు దూరంచేసిన ఉన్మాది"
ఎంతెత్తు మనిషిని ,
ఎన్నినవ్వుల్ని మింగింది !
నాక్కొంచెం సహకరించండి
నేనిప్పుడు నదిని హత్యచేయాలి !
ఒక మరణం ఎన్నిప్రాణాల్ని మెలిపెట్టింది
ఒక నిష్క్రమణ ఎన్ని మరీచిక మైదానాల్ని ముఖాన విసిరింది
ఇప్పుడు..
కలిసి నడిచిన దార్లన్నీ కన్నీటి మడుగులవుతున్నాయి
హృదయం ఆసాంతం పగిలిన లాంతరయ్యింది !
"తీరం వెంటున్న శిధిలమైన పడవలు కంట తడిపెట్టి
జరిగిన ఘోరాన్ని అంచనావేస్తున్నాయి..!"
నాక్కొంచెం సహకరించండి
నేనిప్పుడు ఎలాగైనా నదిని హత్యచేయాలి !!
నామిత్రుడు శవాన్ని ఆరేవు దాటించండి
"చిట్లిన పెదవి కార్చే నెత్తుర్ని
నా చర్మం వొలుచుకెల్లి తుడిచిరండి!"
నవ్వుకుంటెళ్ళిన నామిత్రుడు
శవమై తిరిగొస్తున్నాడు
మీరందరూ ఎదురెళ్ళండి..
అలసిన నా దేహపు అంపశయ్య పై నెమ్మదిగా దించి నిద్రపుచ్చండి
నన్నేవైనా మాటల మత్తుమందులిచ్చి మాయపుచ్చండి !
నాక్కొంచెం సహకరించండి
ఒక "కత్తి పడవ" తెచ్చి
నది దేహాన్ని రాజమండ్రి నుంచి భద్రాచలం దాకా కోసుకెళ్లండి
ఆనకట్టల గేట్లు ఎత్తండి,
గట్లకు గండి కొట్టండి,
వంతెనలు కూల్చండి,
ఏదేమైనా చేసి నాక్కొంచెం సహకరించండి..
నా మిత్రుడిని హత్యచేసేందుకు
"ప్రకృతి చీర కట్టి వెన్నెల్లో విహరించే వేశ్యగోదావరిని నేనిప్పుడు హత్యచేయాలి !
.........."నీ"
(ప్రాణానికిప్రాణమైన గొపాల్ గోదావరిలో పడి చనిపోయిన విషాదాన్ని కళ్ళలోంచి రాల్చుకుంటూ..గోదావరిని జీవితాంతం ద్వేషిస్తూ)

*13-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి