అదిగదిగో అటు చూడొకసారి
సరిమల కాంతుల పండువెన్నెల
నీలుగు జిలుగుల తోయజవైరి
విరియబాఱెను మధుర చిన్నెల
.. ..
నెలవొందినవి తీపితలపులు
పూలపొలపిత వలపురాగములు
మెలివేసినవి ప్రేమపలుకులు
కిలారించినవి తనువుతాపములు
.. ..
మలయిస్తున్నవి మోహవేదనలు
నిలువబారెను తాపపుతనువులు !
వలపు జంటకివి రాగసౌధములు
మలయమారుతపు ప్రేమభానువులు !!
(ఈ కవితలో ప్రతి పాదములోని అంత్యాక్షరద్వయమును (చివరి రెండు అక్షరాలను) అనుసరించింది తరువాత పాదములో (మొదటి రెండక్షరాలు) పదప్రారంభము జరిగినది.. గమనించగలరు. )
*26-07-2012

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి