పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, జులై 2012, శనివారం

వల్లూరు మురళి || నేడేమైనాయి? ||

తొలకరి వాన చినుకు కోసం ఎదురు చూసే
రైతు కళ్ళల్లో కన్నీరు ఏమయింది?
పొలం లో పగడాలు పండాయ అన్నట్లు
ఆరుద్ర పురుగుల అలికిరి ఏమయింది?

గట్లపై వెళుతుంటే కళ్ళకు అడ్డం పడే
గుట్ల కొద్ది రోకలి బండి పిల్లల ఏమయ్యాయి?
వర్షపు నీటిలో ప్రాకే కర్షక మిత్రులు ఎక్కడ?
దీపపు కాంతికి ఎగిరోచ్చే రెక్కల పురుగు లేవి?

సెలవోచ్చిందంటే చాలు నేరేడు చెట్ల పైనే కొలువు
వేడి పళ్ళు కావాలా, చల్లని పళ్ళు కావాలా అంటూ
మిత్రుల నాటపట్టించే రోజులేమయ్యాయి?
మోదుగ దొప్పలలో తెచ్చిన నేరేల్లేమైనాయి?

పిల్ల కాలువ లో పట్టి తెచ్చిన చేప పిల్లలేవి?
జల కలతో నిండుగా ఉండే చెరువులు
చెరువులలో కొట్టే ఈత పందేలు నేడేమైనాయి?
కోనీటిలోని నల్ల కలువలు ఏమయ్యాయి?
ఏ చేతి వాటానికి బలై చెరువులే కనుమరుగైనాయో?

ఊరిచివర ఊడలమర్రి చెట్టు నీడలో చేరి
నేస్తాలతో కూడి ఆడిన ఊసులు నేడేమైనాయి?
కిలకిల రావాల పక్షుల అలజడి ఏమైంది?
ఏ సామిల్లో, ఏ ప్రోక్లినరో నమిలేసి ఉంటుందా?

నల్ల ధనాన్ని తెల్లగ చేయగ పేదల పొలాలను
కబలించి పచ్చని పంట పొలాలను సైట్ లుగా చేసారా?

పుట్టల పై వెతికి పట్టుకొచ్చిన పుట్ట గోడుగులేవి?
పొదల్లో దూరి ఏరుకోచ్సిన బలుసుపల్లేవి?
మెరక పొలం లో కాల్చిన వేరుశనగ కాయలేవి?
ఆ మెరక పొలాలు మరి ఏమయ్యాయి?
రియల్ ఎస్టేట్లు, సెజ్ లుగా మరిపోయవా?
*20-07-2012

2 కామెంట్‌లు:

  1. మురళి గారూ,
    అదొక మరలి రాని బాల్యాను భూతి. మనం అనుభవించామనే ఆనందం కాదు. మనపిల్లలకి ఆటువంటి అనుభూతి మిగలలేదే అన్న బాధకూడ ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలంటే ప్రజలు కాదు. ప్రజాస్వామ్యాలు 'ప్రజలచేత ప్రజలకొరకు" అంతకన్నా కాదు. అవిప్రజలచేత, రాజకీయ నాయకులకూ, వాళ్ళ పిల్లలూ, వాళ్ల పిల్లల పిల్లలకూ. వెన్నెముకలేని మన రాజకీయనాయకులు ఒక కుటుంబానికీ, ఆ కుటుంబంలో ఇప్పుడు పుట్టిన పిల్లలకే కాదు, ఆ ఇంట్లో ఉన్న కుక్కలకీ, పిల్లులకీ కూడా అవి దేశాన్ని పరిపాలించగల శక్తి ఉన్నాయని తమ విశ్వాసాన్ని ప్రకటించగలరు. ఒకప్పుడు మనం తెల్లవాడికి దాసులం. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకీ, దాన్ని నడిపే అరాజక శక్తులకీ దాసులం. రాజకీయ బానిసత్వం పోరాటంతో సాధించుకోవచ్చు. ఇది అలా జరగదు. దీనికి బాగా ఆలోచించి ఆచరించగల యువతరం కావాలి. తమజీవితాలనీ భవిష్యత్తునీ కబళిస్తున్న ఈ అరాజకశక్తులకి సమర్థవంతంగా చెక్ పెట్టగల యువతరం కావాలి. ఒక త్రాటిమీద నడిపించగల ఐకమత్యం కావాలి. మురుగుకాలువల్లాంటి పట్టణాలనుండి, పచ్చని గ్రామాలకి అభివృధ్ధిని తీసుకెళ్లగల ఆర్థిక ప్రణాళికలు కావాలి. మళ్ళీ అప్పుడు మీరు చెప్పినవన్నీ తిరిగి రాగలవు. లేకపోతే అది కావ్యాలకీ, కాగితాలకీ పరిమితం.
    అభివాదములతో

    రిప్లయితొలగించండి
  2. మూర్తి గారూ! కృతజ్ఞతలండి! 1990 లొ ఎకర భూమి విలువ రు.10,000/- ఉందేది. ఆ భూమి ఇప్పుదు 50,00,000/- కి చేరింది. పంట భూములు రియల్ ఎస్తేట్లుగా మారిపొయావి. మా వూరు చుట్టూ మామిడి తొటలు అధికంగా ఉండేవీవి ఇప్పుదు కనుమరుగైపొయావి. చెట్లు నరికివేత కారణంగా వర్షాలు కూడా మందగించాయి.

    రిప్లయితొలగించండి