పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఏప్రిల్ 2014, సోమవారం

Patwardhan Mv కవిత

అపరిచితుడు::::: నుదుట నెన్ని రాసితివో నూకల నీవు ముందుకు పోనీవు నన్ను వెనుకకు రానీవు. సుఖమే అని చెప్పి నన్ను సులావుగాబట్టి ఎక్కడి కక్కడె బాధల మేకులు దిగకొట్టి ఏడ్వ లేక నవ్వలేక నేడుస్తుంటే సిలువపైన బతుకంతా ఈడుస్తుంటే ...... ఏర లడిగినారని నను పసుపు పతంగీని చేసి ఆశయాల గగనంలో అత్యున్నతి నెగరేసి ఆచరణా సూత్రమ్మును దారుణముగ తెంపేసి పతన కంటకాలలోన వేగంగా పడద్రోసి...... ముదమైనా పెదాలపై నవ్వు హంస వ్రాలదు వ్యథయైనా కనుల నశ్రుకణ మొక్కటి రాలదు అనుభూతుల శూన్యతనే కానుక నిచ్చి నడయాడే ఎడారిగా నను కానిచ్చి ......... మంచోడని జగ మంతా మెచ్చేస్తుంటే నా లోపలి మనిషి నన్ను నవ్వేస్తుంటే మోయలేని మంచితనం ప్రశ్నిస్తుంటే నన్ను చూసి నాకే మరి భయమేస్తుంటే....... ఈ భాష నాది కాదు-- ఈ ఆశ నాది కాదు ఈ ఆశ నాది కాదు--నే నసలు నేను కాను నాకే తెలియని దేదో నాలో శ్వాసిస్తే కీర్తి కాంక్ష కుతిక మీద కత్తి లాగ శాసిస్తే...... 21-04-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rcfeww

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి