పట్వర్ధన్ ఎం.వి---- // అర్థాంగీకారం || ఎలా ఉన్నాడు? నచ్చాడా? పెదవుల మీది పేలవమైన ప్రశ్న సమాధానాన్ని ఆశించని పరమ యాంత్రికమైన ప్రశ్న యథాలాపమైన ప్రశ్న ఇదే ప్రశ్న కొన్నేళ్ళ నుండి వేయబడీ,వేయబడీ మొదలూ,కొసా అరిగి పోయి జవ జీవాల్ని కోల్పోయి శూన్యంలో ఎగరేసిన వస్తువులా ఏ ఆకర్షణా లేక ,ఒకానొక నిరీహా నిశ్చల స్థితిలో ఒక వెర్రి నవ్వు పరిమళాన్ని నింపుకున్న ప్రశ్న గాయాల తుప్పుతో మొండుబారిన ప్రశ్న అప్పుల ఉరి కొక్కెంలా వేలాడుతున్న ప్రశ్న గంధక ద్రావణంలో మరిగి కరిగి చల్లారిన ప్రశ్న ఒక చక్కటి సౌశీల్యానికి మాపదండమైన ప్రశ్న తన గుడ్లను తానే తినే పాము నోరులా ఉంది ప్రశ్న పడి లేవని చచ్చిన కెరటంలా ఉంది ఇప్పుడు ప్రశ్న న్యాయ మూర్తి విరిచేసిన పాళీలా ఉంది కానీ... ఆమె హృదయ తీరంలో ఎక్కడో ఇప్పటికీ సమాధానం సజీవ శిలాజంలా ఉండే ఉంటుంది. 21-05-2014,మంచిర్యాల్.
by Patwardhan Mv
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jVgLCJ
Posted by Katta
by Patwardhan Mv
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jVgLCJ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి