కవితావేశం 16.02.14 నేను ఒక కవిని సాధారణ కవిని అల్లిబిల్లి కవితలేవో అందంగా అల్లాలని అందమైన పదాల కోసం ఆరాటంగా,ఆవేశంగా వెతికాను. అందమైన పదాలు దొరికాయి భాషలో అందముంది భావంలోనూ అందముంది. కానీ నాకవి హృదయంలోనే ఏదో చెప్పలేని వెలితి! చెట్టూ,పువ్వూ జాబిలి,వెన్నెల సన్నజాజులు,పరిమళాలు వెన్నెలరాత్రులు,మధురానుభూతులు ఉషోదయం,నవోదయం చెలికోరిక,ప్రేమకానుక వానచినుకు,తొలకరి మెరుపు ఇలా ఎన్నో అందమైన పదాలతో కవితలల్లాను కాని మనసులో ఏదో చెప్పలేని వెలితి ! దరిద్రం,దౌర్భాగ్యం ఆకలికేకలు,మండేవేదనలు అనారోగ్యం,వికృతరూపం కుంటిబతుకు,గుడ్డిబతుకు చీకటిరాత్రులు,మౌనరోదనలు కష్టాల కొలిమి, కన్నీళ్ల కలిమి మరి ఈపదాలన్నీ కూర్చి ఏ కవితలల్లను? అందుకే నాకవి హృదయంలో చెప్పలేని వెలితి! ఇక కవిగా నాకర్తవ్యమేమిటో బోధపడినాక నిశ్చింతగా అనిపించింది!!
by Bharathi Katragadda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gIcMeG
Posted by Katta
by Bharathi Katragadda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gIcMeG
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి