నాకోసమే వెలసిన సౌందర్య రాసి నన్నే వెతుక్కుంటూ వచ్చిన నెచ్చెలి జగణమో, మగనమో యతిప్రాసలు కూర్చి చందస్సు తప్పక నిషిద్దాక్షరాలు లేకుండా చంపకమాల, మత్తేభం, శార్దూలాలు చిన్నబోయేల తేటగీతి తెల్లబోయేలా ఏ మహా కవో రాసిన పద్యమే ఆమె సరిగమ పదనిసో సనిధపమగారిసో రాగరంజితమై శృతిలయలు తప్పక ఏ వాగ్గేయకారుడో పాడిన శృంగారగీతం నేనాస్వాధించే సంగీతం ఆమె సాహిత్యం సంగీతం కలగలిసిన నా చిన్నది నన్నెప్పుడూ వీడనిది
by Venugopal Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qUA2KB
Posted by Katta
by Venugopal Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qUA2KB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి