పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, జూన్ 2014, సోమవారం

Chi Chi కవిత

_ఆవాహన_ ఇక్కడే ఆగిపో భయమొద్దనుకుంటే!! భయపడాలనుంటే సరిపడా దూరం పో!! భయమే రాకుంటే నువ్విక్కడున్నట్టే.. భయమే లేదనుకుంటే నువ్వున్నా లేకున్నా ఒక్కటే!! పిలుస్తున్నాయి విను.. అవి ప్రేమో కామమో కన్న పేగు కూతలు కావు!! కళ్ళు లోడలేని మట్టిని చూపు తోడేసి వెళ్తే అణువులయ్యుండే భూగర్భాంతర్యాలు!! సమయాన్ని తాకద్దు.. సరి సూటి మార్గమొకటే ఆవిర్భావాల మూలమొకటే నిత్య ప్రక్రియం స్వయంభూ దేహం!! లింగ విభజనమే ఉత్తర దక్షిణ దృవం క్షేత్రగుండ విసర్జనం స్త్రీత్వం పురుషత్వం!! వినిపించాయా మూలాలు ప్రత్యక్షానుభూతిలో ప్రమేయలేమిలో పలకరిస్తున్న జన్మలు.. అవి ఖండాలన్నిట్లో చిగురిస్తున్న మొదళ్ళు .. అవకాశ మొహానికి ఇంకా లొంగని చలనాలు నువ్వనుకునే మనుషులే వాళ్ళు నిన్నేమనుకోని నీ వాళ్ళు.. మొహం చెందితే మనుషులైపోతారు.. లేదంటే మరుగునే పోతారు!! భయం వారి గురించి కాదు నువ్వు కూడా అటువంటొక్కణువేనని అర్దమైతే కలిగే నివ్వెర గురించి!!

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lsCbry

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి