పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, జూన్ 2014, సోమవారం

Si Ra కవిత

Si Ra// అకస్మిక ప్రేమ కవిత // 16-6-14 గందరగోలం మధ్యలో చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం, మాట్లాడాలి అనుకున్న మాటలన్నీ గొంతులోనే గడ్డ కట్టాయి. శబ్ధాల మధ్యలో మా ఇద్దరి ప్రాణాలూ చుట్టూ అల్లుకున్న నిషబ్ధ అడవిలో తప్పిపోయాయి. అప్పుడే వర్షం కల్లోలం సృశ్టించి, ఎండని పొట్లం కట్టుకోని పారిపోయింది. కొన్ని రోజులుగా వెతుకుతున్నా దొరకని ఒక తాళంచెవి అకస్మికంగా దొరికినట్టు, తను నవ్వింది. ఎన్నో నిషబ్ధ రాత్రులు మూతపడి ఉన్న ఒక తలుపు తెరుచుకున్నట్లూ, జోబీ లోంచి ఒక కాగితం తీసాను. దాన్ని లొపలికి బయటకి మడిచి ఒక పడవ చేసి తనకు ఇచ్చాను, తను ఆ పడవని విప్పి ఖాలి కాగితం నా చేతిలో పెట్టింది. ఆ కాగితాన్ని తీసుకొని ఒక ప్రేమ కవిత రాసి తనకు ఇచ్చాను, తను దాన్ని లొపలికి బయటకి మడిచి నాకొక పడవ చేసి ఇచ్చింది.

by Si Ra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1votaYh

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి