అనువాద కవిత్వం : ( అంతర్జాల సాహితీ పత్రిక 'సుజనరంజని 2014 ప్రచురణ ) .... || రాత్రి ॥.... .( Night ) నిశీథినీ ! బరువైనవి నా భ్రుకుటి మీద నీవు మోపిన భారాలు. భరించరానివి నీ సాదు హలం చిమ్మిన అసహన అభిఘాతాలు. మబ్బులకున్న రస చైతన్యం నాకు లేదు! తరుణీ ! తరళ యామినీ ! నీవు సముద్రం మీది నెలవంక మీద నిశ్శబ్దమై నిలువడం, ఈర్ష్య నిండిన నీ చూపులతో తరగల తళత్తళలను ఆర్పడం, నిరంతర కెరట పరంపర మీద నిలిచి నీవు లలిత నాట్యాలు చేయడం నేను చూస్తూనే వున్నాను. తీరాన నీరసంగా నేను ప్రటిఘటించలేని ఇసుక దిబ్బలా, ఉడిగిన రుధిరంలా, ఉప్పు నీటిలా మూలాలలోకి ప్రవహించు కుంటూ . నీ వెచ్చని ముద్రల జీవకణాలు తడిపిన తడి తడి చిత్తడి ఆకుల గుండా నీవు వర్షిస్తూనే వున్నావు కుత్తుక తెగిన నీడలను. నా జ్ఞానేంద్రియాలు నన్ను బాధిస్తున్నవి మొహం చాటేసి మాటేసే నిశ్శబ్ద రాత్రించరుల్లా . నన్ను దాచేయండి -- చొచ్చుకొస్తున్నాయి ధాత్రిని వెంటాడే రేతిరి బాల్యాలు; నంగనాచి బూచీలు అవి నాకు అప్రియాలు. అయినా, వాటి కుటిల కవ్వింపులు అనూహ్యంగా నన్నాసాంతం తిరుగదోసి నన్ను దిగంబరున్ని చేసేట్టున్నవి. మూలం : వోలే సోయింకా, నైజీరియా నోబెల్ లారియెట్ తెలుగు సేత : నాగరాజు రామస్వామి Dt: 16.06.2014.
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ov8Apn
Posted by Katta
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ov8Apn
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి